HYD Cyber Crime Police: తస్మాత్ జాగ్రత్త.. ఈ నంబర్ల నుంచి ఫోన్ వస్తుందా? లిప్ట్ చేయొద్దు..
- సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాలు..
- అలర్ట్ అయిన తెలంగాన సైబర్ క్రైం పోలీసులు..
- తెలియని నెంబర్, తెలియని కోడ్ లతో కాల్స్ వస్తే లిప్ట్ చేయొద్దని సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
HYD Cyber Crime Police: సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సెల్ ఫోన్లకు మెసేజ్ లు, కాల్స్ చేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతా, డెబిట్, క్రెడిట్ కార్డుల వివరాలను దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఇక తాజాగా సైబర్ నేరగాళ్లు మరో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు విదేశీ ఫోన్ నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను అనుమతించవద్దని చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. +94777 455913, +37127913091, +56322553736, +37052529259, +255901130460 వంటి నంబర్‌ల నుండి మీకు కాల్ వస్తే, లిప్ట్ చేయవద్దని సూచించారు.
Read also: TG High Court: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టు ఝలక్..
Also Read
సైబర్ కేటుగాళ్లు ప్రధానంగా +371 (లాట్వియా), +375 (బెలారస్), +381 (సెర్బియా), +563 (ఐయోవా), +370 (లిథువేనియా), +255 (టాంజానియా) వంటి కోడ్‌లతో ప్రారంభమయ్యే నంబర్‌ల నుంచి రింగ్ చేసి, కాల్ లిప్ట్ చేయగానే హ్యాంగ్ చేస్తారని తెలిపారు. మీరు తిరిగి కాల్ చేస్తే, మీ కాంటాక్ట్ లిస్ట్, బ్యాంక్, క్రెడిట్ కార్డ్ వివరాలు మొదలైనవి మూడు సెకన్లలో కాపీ చేయబడే ప్రమాదంగా పెట్టుకున్నారని తెలిపారు. మీరు హ్యాష్ 90 లేదా హ్యాష్ 09 నంబర్‌లను డయల్ చేయమని ఎవరైనా సూచించినట్లయితే వారు అలా చేయవద్దని చెప్పారు. అలా చేయడం మీ సిమ్ కార్డ్‌ని యాక్సెస్ చేయడానికి, మీ ఖర్చుతో కాల్‌లు చేయడానికి అంతేకాకుండా మిమ్మల్ని నేరస్థుడిగా మార్చడానికి చేసిన కుట్రగా పరిగణించాలని తెలిపారు. కావున ప్రజలు ఈ నెంబర్, కోడ్ లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
KTR: రాష్ట్రంలో జరిగింది యువ వికాసం కాదు… యువ విలాపమే..
తాజావార్తలు
-
Jobless: డిగ్రీలు ఉన్నా జాబ్ దొరకకపోవడానికి కారణం ఇదేనా..? వైరల్ అవుతున్న నిరుద్యోగి సంచలన వ్యాఖ్యలు..
-
CM Revanth Reddy: టీజీ సేఫ్ అమల్లోకి తెచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణలో ప్రారంభమైన కొత్త అథారిటీ..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట..
-
Husharu Pittalu OTT Release: అమెజాన్ ప్రైమ్‌లోకి ‘హుషార్ పిట్టలు’.. బోల్డ్ టీనేజ్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
AP Assembly 2026: నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. గ్రూప్-1 అక్రమాలపై ప్రత్యేకంగా చర్చ!
ట్రెండింగ్
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్‌గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్‌బుక్‌లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!