Site icon NTV Telugu

CP Sajjanar: అర్ధరాత్రి సీపీ సజ్జనార్ పెట్రోలింగ్.. రౌడీషీటర్ల ఇళ్లలో తనిఖీలు

Sannar

Sannar

CP Sajjanar: హైద‌రాబాద్ సీపీ వీసీ సజ్జనార్ అర్ధరాత్రి సమయంలో పెట్రోలింగ్ చేశారు. రౌడీ షీటర్ల ఇళ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు చెప్పిన అడ్రస్సులో ఉన్నారా లేదా అని తెలుసుకున్నారు. రౌడీ షీటర్ల అడ్రసు తెలుసుకుని ఉండాలని స్థానిక పోలీసులకు సీపీ సూచించారు. వారి నేర చరిత్ర, జీవన శైలిపై ప్రత్యక్ష ఆరా తీశారు. నేర ప్రవృత్తి మానాలని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. లంగర్ హౌస్, టోలిచౌకీలో అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల మధ్య ఈ ఆకస్మిక పర్యటన చేశారు.

Read Also: Pakistan: పాక్‌ మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఆత్మాహుతి దాడి.. ముగ్గురు మృతి

అయితే, రాత్రి వేళల్లో తెరిచి ఉన్న షాపులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. పెట్రోలింగ్ సిబ్బంది తనిఖీలు చేపట్టాలని సూచించారు. గస్తీ పాయింట్లు, స్పందన వేగంపై సమగ్ర పరిశీలన చేయాలని తెలిపారు. టోలిచౌకీ పీఎస్‌లో రాత్రి ఎంట్రీలు, హాజరు చెక్ చేశారు. విజిబుల్ పోలిసింగ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అలాగే, నగర భద్రతపై కఠిన పర్యవేక్షణ కొనసాగుతుంది అని సీపీ వీసీ సజ్జనార్ వెల్లడించారు.

Exit mobile version