NTV Telugu Site icon

హైదరాబాద్‌లో దారుణం.. మూత్రం తాగాలని భర్త వేధింపులు

హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్‌లో దారుణం చోటుచేసుకుంది. తనను తన భర్త, అతడి కుటుంబసభ్యులు వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఓ మహిళ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్ధనగ్నంగా కూర్చోవాలని, మూత్రం తాగాలని భర్త వేధిస్తున్నట్లు ఆమె ఆరోపించింది. 2016లో తమ వివాహమైన నాటి నుంచి వేధింపులు కొనసాగుతున్నాయని వాపోయింది. మరోవైపు కులం పేరుతో తన భర్త కుటుంబసభ్యులు దూషిస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

Read Also: వైర‌ల్‌: పెళ్లి వేడుక‌ల్లో అనుకోని అతిథి… జనాల ప‌రుగులు

కాగా నారాయణపేట మక్తల్‌కు చెందిన భార్యాభర్తలు 2016లో లవ్ మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్‌లోని రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. పెళ్లయిన నాటి నుంచే తనను అదనపు కట్నం తీసుకురావాలని అత్తింటి వారు వేధిస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. తన భర్తకు రూ.1.5 లక్షలు ఇచ్చినా వేధింపులు ఆగలేదని ఆమె పేర్కొంది. దీంతో ఆమె భర్త, అతడి కుటుంబసభ్యులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.