NTV Telugu Site icon

Fire Accident: అంబర్‌పేట ఫ్లైఓవర్ కింద అగ్ని ప్రమాదం.. భారీగా ట్రాఫిక్ జామ్

Ambarpet

Ambarpet

Fire Accident: హైదరాబాద్‌ నగరంలోని అంబర్‌పేట్‌లో గల ఫ్లైఓవర్‌ కింద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చే నంబర్‌ చౌరస్తా దగ్గర ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనుల కోసం వేసిన షెడ్లలో ఈరోజు ( మార్చ్ 4) ఉదయం ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి. దీంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలముకోవడంతో.. స్థానికులు, వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. నల్లటి పొగ కమ్ముకోవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

Read Also: SLBC: రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకాలు.. మరో ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిక

అయితే, అంబర్‌పేట్ కొత్త ఫ్లై ఓవర్‌పై నుంచి రాకపోకలు ఫిబ్రవరి 26వ తేదీన ప్రారంభమైంది. వరంగల్‌ జాతీయ రహదారిపై ఏళ్ల క్రితం ఫ్లైఓవర్‌ నిర్మాణం స్టార్ట్ అయింది. పనులు నిదానంగా కొనసాగడంతో ఇన్ని రోజులు ప్రయాణికులతో పాటు స్థానికులు నానా అవస్థలు పడ్డారు. అయితే, శివరాత్రి పండగ నుంచి ఫ్లైఓవర్‌పై నుంచి వాహనాలను అనుమతి ఇవ్వడంతో చాలా సంవత్సరాల తరబడి నిరీక్షణకు తెరపడినట్లైంది.