Holi Celebrations: హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోలీ వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. సప్తవర్ణాల్లో కుర్రకారు హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తున్నారు. ఒకరికి ఒకరు ముఖానికి సహజ సిద్ధమైన రంగులు అద్దుకుని కేరింతలు కొడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు హోలీ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. గల్లీ గల్లీలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. పలు చోట్ల హోలీ ఈవెంట్స్ సైతం ఏర్పాటు చేశారు. డీజే సాంగ్స్ తో, రెయిన్ డ్యాన్స్ తో కుర్రకారు జోరు ఉర్రూతలు ఊగుతున్నారు. ఈసారి యూత్ హోలీని మరింత కలర్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
Read Also: Nizamabad: పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తి మృతి.. ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత..!
ఇక, హోలీ పండగ సందర్భంగా ఈరోజు హైదరాబాద్‌లో పోలీసులు ఆంక్షలు విధించారు. రేపు (శనివారం) ఉదయం 6 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. నేటి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసి వేస్తునట్లు వెల్లడించారు. అలాగే, ప్రజలు ఎవరు కూడా రోడ్లపై గుంపులుగా తిరగొద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. వాహనదారులపై రంగులు జల్లొద్దని హైదరాబాద్ సీపీ సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.