Bomb Threat: లండన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన బ్రిటిష్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో సేఫ్ గా ల్యాండింగ్ చేశాడు. ఇక, విమానంలోని ప్రయాణికులను ఫ్లైట్ నుంచి దింపిన అనంతరం క్షుణ్ణంగా తనిఖీ చేపట్టిన బాంబ్ స్క్వాడ్ బృందాలు.. విమానంలో ఎలాంటి బాంబు లేదని సెక్యూరిటీ అధికారులు తేల్చారు. దీంతో ఎయిర్ పోర్ట్ ఆధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు బెదిరింపు మెయిల్ పై ఎయిర్ పోర్టు పోలీసులకు అధికారులు ఫిర్యాదు చేశారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్టు పోలీసులు, బాంబు బెదిరింపుపై వచ్చిన మెయిల్ పై దర్యాప్తు చేపట్టారు.