Group-1 Candidates: అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్తత.. పోలీసుల అదుపులో విద్యార్థులు
- అశోక్‌నగర్‌లో గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన..
- అశోక్‌నగర్ వద్ద ప్రెస్‌మీట్ నిర్వహించేందుకు అభ్యర్థుల యత్నం..
- ప్రెస్‌మీట్‌ను అడ్డుకొని అభ్యర్థులను అరెస్ట్ చేసిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Group-1 Candidates: రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించడానికి వ్యతిరేకిస్తూ కొందరు అభ్యర్థులు నిరసనకు దిగడంతో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రోడ్డుపైకి వచ్చిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ప్రెస్‌మీట్‌కు అనుమతి లేదంటూ పోలీసులు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన విద్యార్థులపై పోలీసుల దౌర్జన్యం ఆపాలని గ్రూప్-1 బాధితులు నినాదాలు చేశారు. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ గత కొద్ది రోజులుగా కొందరు అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ శనివారం బాధితులతో కలిసి ఆందోళన చేయడం సంచలనం సృష్టించింది. తాజాగా ఈరోజు విద్యార్థులు నిరసనకు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు రేపటి నుంచి పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఇప్పటికే పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.
HYDRA Tweet: కూల్చివేతలపై తప్పుడు వార్తలు.. హైడ్రా కీలక ప్రకటన
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్‌కు హరీశ్ రావు లేఖ..!
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- TG EAPCET: తెలంగాణ ఎప్‌సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!