Hyderabad Old City: హైదరాబాద్ నగరంలో హోలీ పండుగ సందర్భంగా పాతబస్తీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఈ సందర్భంగా పలు ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా చార్మినార్, మక్కా మసీద్, భాగ్య లక్ష్మీ టెంపుల్ దగ్గర పటిష్ట బందోబస్తు కొనసాగిస్తున్నారు. 35 సంవత్సరాల తర్వాత ఒకే రోజు రంజాన్ మాసం రెండో శుక్రవారం జుమ్మ రోజున హోలీ పండుగ వచ్చింది. అతి సున్నితమైన ప్రాంతాలు కావడంతో ఓల్డ్ సిటీలోని పలు చోట్ల పోలీసుల పికేటింగ్ ఏర్పాటు చేశారు.
Read Also: Pawan Kalyan-Chiranjeevi: పవర్ స్టార్ ఫిక్స్.. మరి మెగాస్టార్ పరిస్థితేంటి?
కాగా, పాతబస్తీలో శాంతి భద్రతలను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, సౌత్ జోన్ డీసీపీ స్నేహ మిశ్రా పర్యవేక్షించారు. రోడ్ల మీద వెళ్లే వారిపై రంగులు చెల్లితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ర్యాలీలు నిర్వహించి రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు అని పేర్కొన్నారు. మక్కా మసీద్, భాగ్య లక్ష్మీ దేవాలయం వద్ద రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సిటీ ఆర్మ్ రిజర్వ్, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ బలగాలతో పహారా కాస్తున్నారు. అలాగే, పాతబస్తీలో సీసీ కెమెరాలు ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు భద్రతాను సీపీ, సీవీ ఆనంద్ పర్యవేక్షిస్తున్నారు.