NTV Telugu Site icon

Harish Rao: మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదు..

Harish Rao

Harish Rao

Harish Rao: మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు గడప దాటడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 65 మంది బీసీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయట్లేదు అంటూ మండిపడ్డారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యా నిధి పథకంలో ఆర్థిక సహాయం పొందిన 65 మంది బీసీ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిధులను విడుదల చేయడం లేదు? అని ప్రశ్నించారు. పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనే సదుద్దేశంతో కేసీఆర్ గారు రూపొందించిన ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందా? అన్నారు. కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారి మాటలకు అర్థం ఇదేనా? అని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్లు మార్చడం, విగ్రహాలు తొలగించడం సులభం కానీ, హామీలను నిలబెట్టుకోవడం కష్టం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గుర్తుందా? మొదటి అసెంబ్లీ సమావేశంలో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తామన్న హామీ ఏమైంది?.. మాటలు కోటలు దాటుతున్నాయి కానీ చేతలు మాత్రం గడప దాటడం లేదని హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడ్డారు.

Read also: Thangalaan : ఎట్టకేలకు ఆ ఓటీటీలోకి తంగలాన్

నిన్న జరిగిన సంగుపేట అలయ్ బలయ్ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాల్లో పారిశుద్ధ్యం ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? అని ప్రశ్నించారు. సంజీవన్ రావు పేటలో పండుగ పూట ఏం అయ్యిందో చూశామన్నారు. పేదల కడుపు నింపడం కేసీఆర్ అజెండా.. పేదల కడుపు కొట్టడం కాంగ్రెస్ ఎజెండా అని విమర్శించారు. బతుకమ్మ చీరలు రెండు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదు.. వర్షాకాలం రైతు బంధు లేదన్నారు. రుణమాఫీ సరిగా కాలేదని.. ఋణమాఫీపై డేట్లు పొడగిస్తున్నారన్నారు. నిన్న వ్యవసాయ శాఖ మంత్రి మళ్ళీ 2024 డిసెంబర్ 9 అంటూ కొత్త తేదీ చెప్పారని గుర్తు చేశారు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారో చెప్పరని.. ఎంత ఇస్తారో చెప్పరని మంత్రి హరీష్ రావు అన్నారు. నిరుద్యోగులకు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అని ఊరించి మోసం చేశారని మండిపడ్డారు. నిరుద్యోగులకు కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ఇచ్చిన 30 వేల ఉద్యోగాలే తప్ప కాంగ్రెస్ వాళ్లు ఇచ్చింది ఏమి లేదన్నారు.
Top Headlines @ 9 AM: టాప్‌ న్యూస్‌

Show comments