Harish Rao: కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్పా.. పూడ్చివేతలు రాదా? అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎండిపోతున్న పంట పొలాలపై తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాలపున సముద్రామున్న చేపపిల్లలు నీటి కేడ్చినట్టు ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయ్ అని మండిపడ్డారు. 22 రోజులైన కాల్వకు గండి పూడ్చడం చాతకాగ.. రైతుల పొలాలు ఎండ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు కృష్ణనది నిండు కుండలా ఉందన్నారు. సాగర్ లో నీరున్న పంటలన్నీ ఎండిపోతున్నాయ్ అన్నారు. పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో రైతులు ఎన్ఎస్పీ ఆఫీసులను రైతులు ముట్టడిస్తున్నారన్నారు. పార్టీలకతీతంగా ధర్నా చేస్తున్న ప్రభుత్వం నిద్రపోతున్నదన్నారు. గతేడాది నీరు లేక పొలాలు ఎండిపోయాయ్ అని గుర్తు చేశారు. ఈసారి పుష్కలంగా వర్షాలు పడిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం వల్ల లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు.
Read also: MHSRB: గుడ్ న్యూస్.. తెలంగాణలో 3334 జాబ్స్ భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్..
జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉండి కూడా గండిపడిన కాల్వ పక్క నుంచే వెళ్తున్నారన్నారు. 22 రోజులైనా గండిపూడ్చాలని సోయిలేదా? అని ప్రశ్నించారు. ఆకాశాన్ని దించుతాం, సూర్యుని వంచుతాం అనే డైలాగులు కొడుతున్న రేవంత్ రెడ్డి జిల్లా మంత్రులు.. కాల్వ గండి పూడ్చాడం చాతకాదా? అని మండిపడ్డారు. 9 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే.. 3 లక్షల ఎకరాల పంటలు ఎండబెడతారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చివేతలు తప్పా పూడ్చివేతలు రాదా? అన్నారు. హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టడం వచ్చుగానీ.. రైతులకు నీరు ఇవ్వడం రాదా? అన్నారు. కాంగ్రెస్‌కు రైతుల పట్ల జాలి, దయా లేవాఅని మండిపడ్డారు. వరదల్లో కొట్టుకుపోయిన పంటలకు నష్టం పరిహారం ఇవ్వరా? కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు కన్నీళ్లు తూడ్చడం కాదు.. కన్నీళ్లు పెట్టిస్తుందన్నారు. ఎకరాకు 25వేలు సాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. వరద నష్టం వల్ల సాగర్ పరివాకం ప్రాంతాల్లో వల్ల 60వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకం వల్ల లక్ష ఎకరాలు పోయినట్లు ప్రాథమిక అంచనా అన్నారు.
Read also: MLA Madhavaram: ప్రజలను సంక్షేమ పథకాల నుండి దారి మళ్లించేందుకు హైడ్రా కూల్చివేతలు..
ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ నీరు ఇచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితులు లేవన్నారు. ఆగస్టు 15వ తేదీ ముఖ్యమంత్రి రేవంత్ ఖమ్మం జిల్లాలో సీతారామా ప్రాజెక్టు ప్రారంభించి, సీఎం, మంత్రులు డైలాగులు కొట్టిండ్రు అన్నారు. 70 రోజుల్లో ప్రాజెక్టును పూర్తి చేశామని గొప్పలు చెప్పుకున్నారు. సీతారామా ప్రాజెక్టు ద్వారా దిగువన ఉన్న పాలేరుకు నీరు ఎందుకు ఇవ్వట్లేదన్నారు. పనులు పూర్తికాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతారామస్వామి మీద ఒట్టు పెట్టి.. మాట తప్పారని మండిపడ్డారు. దేవుడా రామచంద్రస్వామి ముఖ్యమంత్రిని క్షమించు, ఖమ్మం జిల్లా రైతులను కాపాడు అన్నారు. ఖమ్మ జిల్లా రైతులు ఏం పాపం చేశారు. 9మందిని గెలిపిచడం వాళ్ల తప్ప? అని మండిపడ్డారు. వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్లకు నష్ట పరిహారం ఇవ్వరా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున మేం ఖమ్మం జిల్లాకు వెళ్తాం.. రైతులకు మనోధైర్యం చెబుతామన్నారు. ట్యాంకర్లు, జనరేటర్లు పెట్టుకొని పంటలు తడుపుకొంటున్నారని అన్నారు. దాడులకు బీఆర్ఎస్ ఏనాడు భయపడమన్నారు. వరద బాధితులను పరామర్శించేందుకు మాపై దాడులు చేసిండ్రు.. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు.
Read also: Water Supply: నగరంలో 24 గంటల పాటు నీటి సరఫరా బంద్..
పోలీసులు అతి ఉత్సాహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరిగిందో మనం చూసామన్నారు. పోలీసు అధికారులు చట్టాలకు లోబడి పనిచేయాలి ప్రభుత్వాలకు లోబడి కాదన్నారు. ప్రభుత్వ వైఫల్వాలు డైవర్ట్ చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రాతో హైడ్రామా చేస్తుండ్రు అన్నారు. లక్షల ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోతుంటే, లక్షల మంది డెంగ్యూ చికెన్ గునియా విశ్వవిరాలతో బాధపడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను డైవర్ట్ చేసేందుకు హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. రాష్ట్రంలో గుండాయిజం పెరిగిపోయింది.. అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని తెలిపారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో రెండు వేల అత్యాచారాలు జరిగాయన్నారు. హైదరాబాద్, దేవరకద్రలో నిన్న ఒక రోజే రెండు అత్యాచారాలు జరిగాయన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిపై ఇండిమీదికి నిన్న రాత్రి కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద జరిగిన దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఈ దాడికి బాధ్యత వహించాలన్నారు. రాత్రిపూట ఇంటి ముందు పటాకులు పేల్చి, తలుపులు తీయించి మరీ దాడులు చేసిండ్రు. దాడికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయన్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదు.. దాడికి పాల్పడిన వారిపై వెంటనే డీజీపీ చర్యలు తీసుకోవాలన్నారు.
Sri Lanka vs New Zealand: రసవత్తర పోరులో విజయాన్ని అందుకున్న శ్రీలంక.. రెచ్చిపోయిన ప్రభాత్ జయసూరియ!