NTV Telugu Site icon

Mangalya Shopping Mall: సంయుక్త మీనన్ చేతుల మీదుగా మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్..

Mangalya Shopping Mall

Mangalya Shopping Mall

పట్టు, ఫ్యాన్సీ, హై–ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్‌వేర్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్ వేర్, ఎథినిక్ వేర్‌‌లతో అంతర్జాతీయ షాపింగ్ అనుభూతిని ఇస్తూ.. మార్కెట్ ధరల కన్నా తగ్గింపు ధరలకు అందిస్తున్నారు. ఇది షాపింగ్ అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చే సరికొత్త రిటైల్ డెస్టినేషన్. హైదరాబాద్‌ నార్సింగిలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ మాంగళ్య షాపింగ్ మాల్ గ్రాండ్‌గా ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు నార్సింగి మెయిన్ రోడ్, హెచ్‌పీ పెట్రోల్ బంక్ పక్కన కొత్త షో రూమ్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సినీ నటి సంయుక్త మీనన్ హాజరై సందడి చేశారు. అనంతరం.. జ్యోతి ప్రజ్వళన చేసి షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో అధునాతన కలెక్షన్లతో, నిత్య నూతన వెరైటీలతో అతిపెద్ద షాపింగ్ మాల్‌గా మాంగళ్య అవతరించిందని సినీ నటి సంయుక్త మీనన్ అన్నారు.

Japan: జపాన్ కొత్త ప్రధానిగా షిగేరు ఇషిబా ఎన్నిక..

మరోవైపు.. నార్సింగిలో మాంగళ్య షాపింగ్ మాల్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందని యాజమాన్యం తెలిపింది. మాంగళ్యలో షాపింగ్ అంటే కొత్త అనుభవాన్ని ఇస్తుందని అన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద కుటుంబ రిటైల్ షాపింగ్ గమ్యస్థానంగా పేరుపొందిందని పేర్కొన్నారు. మాంగళ్య షాపింగ్ మాల్‌లో ఫ్యాషన్ ప్రియులకు తగ్గట్టుగా వస్త్రాలు ఉన్నాయని.. ప్రత్యేక డిజైన్లు, వివిధ రకాల కలెక్షన్స్‌ తప్పకుండా మగువలను ఆకట్టుకుంటాయని యాజమాన్యం తెలిపింది. మాంగళ్య షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం అనంతరం… నటి సంయుక్త మీనన్ మాల్ మొత్తం తిరిగారు. మాల్‌లో ఉన్న ఉత్పత్తి ప్రదర్శనలు, ప్రత్యేక డిస్కౌంట్లను పరిశీలించారు.

Delhi: ప్రధాని మోడీ, సోనియాతో సీఎం స్టాలిన్ భేటీ.. టూర్ విశేషాలు ఇవే!

Show comments