CM Revanth Reddy: నేడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం.2 గంటలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్‌లోని కొందుర్గులో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్నారు. ఇందుకోసం కొందుర్గు శివారులోని సర్వే నంబర్ 109లో 20 ఎకరాలు కేటాయించారు. సీఎం రాక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శశాంక, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పనులను పర్యవేక్షించారు. మరోవైపు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గురుకులాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రఘునాథ పాలెం మండలం జింకల తండాలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు లు శంఖుస్థాపన చేయనున్నారు.
Read also: Delhi: స్పెషల్ పోలీసుల దాడి.. రూ.2వేల కోట్ల డ్రగ్స్ సీజ్
కుల, మతాలకు అతీతంగా రాష్ట్రంలోని పేదలందరికీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన అత్యంత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను నిర్మిస్తుంది. మొదటి దశ కింద 28 నియోజకవర్గాల్లో గురుకుల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు. రాష్ట్రంలో మొదటి దశ కింద 28 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకులాలను మంజూరు చేస్తూ బీసీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర వర్గాల పేద విద్యార్థులందరికీ కులమతాలకు అతీతంగా సోదరభావం పెంపొందించేందుకు ఈ పాఠశాలల్లో భోజన ఏర్పాట్లు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. సంబంధిత జిల్లా మంత్రులు, ఇంచార్జి మంత్రుల ఆమోదంతో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమాలకు ఆయా జిల్లాల్లోని ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించాలని సూచించారు. రెండోదశలో నిర్మించే నియోజకవర్గాల్లో భూముల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు.
Read also: Astrology: అక్టోబర్ 11, శుక్రవారం దినఫలాలు
శంకుస్థాపన నియోజకవర్గాలు..
కొడంగల్, మధిర, హుస్నాబాద్, నల్గొండ, హుజూర్‌నగర్, మంథని, ములుగు, పాలేరు, ఖమ్మం, వరంగల్, కొల్లాపూర్, అందోలు, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, భూపాలపల్లి, అచ్చంపేట, మునుగోడు, చెన్నూరు, షాద్‌నగర్, జడ్చర్ల, పరకాల, నారాయణఖేడ్, పరకాల, మన్నారాయణ, పరకాల, నారాయణఖేడ్ , నర్సంపేట.
సౌకర్యాలు ఇవే..
1. ఒక్కో లైబ్రరీలో 5 వేల పుస్తకాలు, 60 కంప్యూటర్లు, తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులు ఉన్నాయి.
2. సమీకృత గురుకులంలో ఒకేసారి 900 మంది కూర్చుని భోజనం చేసేలా డైనింగ్ హాల్ నిర్మిస్తారు.
3. ఇంటిగ్రేటెడ్ గురుకుల భవనాలు వాతావరణానికి అనుకూలమైనవి. ఒక్కో డార్మెటరీ గదిలో పది పడకలు, రెండు బాత్‌రూమ్‌లు ఉన్నాయి.
4. విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల కోసం పూర్తి రెసిడెన్షియల్ క్యాంపస్.. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, స్థిరమైన వాతావరణ పరిస్థితులు.
5. సాంస్కృతిక మరియు విద్యా కార్యక్రమాల కోసం ప్రత్యేక ఆడిటోరియం, ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా మైదానాలు, ఆసుపత్రి.
Congress: హర్యానా ఫలితాలపై కాంగ్రెస్‌లో గుబులు!.. నాయకులపై రాహుల్ గాంధీ సీరియస్