NTV Telugu Site icon

Nirmal Incident: ఇథనాల్‌ ఫ్యాక్టరీ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌..

Ithanal

Ithanal

Nirmal Incident: నిర్మల్‌ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఉద్రికత్త కొనసాగుతుంది. ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేపట్టారు. దీంతో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. అంతేకాదు తక్షణమే నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. ఇథనాల్‌ పరిశ్రమకు గత ప్రభుత్వం ఇచ్చిన అనుమతులపై పునఃసమీక్ష చేయాలని తెలిపింది. ఇప్పటికే ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటును నిరసిస్తూ నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌ గ్రామస్థులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. గ్రామంలో వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటును రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని దిలావర్ పూర్ వాసులు స్పష్టం చేశారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు వల్ల తమ పంటలు, పొలాలు దెబ్బతింటాయని, పర్యావరణం దెబ్బతింటుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటును ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకోవాలని నిర్ణయించారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయితే మరోవైపు ఇథనాల్‌ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఫ్యాక్టరీకి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక పంపామని కలెక్టర్‌ తెలిపారు.
Hyderabad Crime: నార్సింగ్ లో దారుణం.. 9వ అంతస్తుపై నుంచి కిందపడి యువతి మృతి..