NTV Telugu Site icon

ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే…?

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు దిగివచ్చాయి. బంగారం దిగిరావడంతో భారీ ఎత్తున కొనుగోలు పెరిగాయి. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టడం విశేషం. దేశీయంగా మార్కెట్లు పుంజుకోవడంతో ధరలు తగ్గాయి. అయితే, ఈరోజు బంగారం ధరలు భారీగా పెరిగాయి. పెరిగిన ధరల ప్రకారం ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 45,900 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరిగి రూ.50,070 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 400 పెరిగి రూ.72,000 కి చేరింది.