South Central Railway: తెలంగాణ, కర్ణాటక ఎంపీలతో దక్షిణ మధ్య రైల్వే సమావేశం మొదలైంది. సికింద్రాబాద్ లోని నిలయంలో ఎంపీ లతో జిఎం అరుణ్ కుమార్ జైన్ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు సురేష్ రెడ్డి, ఎంపీలు కావ్య, రఘునందన్ రావు, DK అరుణ లు పాల్గొన్నారు. రైళ్ల హాల్టింగ్, కొత్త రైల్వే లైన్, రైల్వే అండర్ బ్రిడ్జిలు, అండర్ పాసులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, నూతన ప్రాజెక్ట్ లు, కొత్త లైన్ లు తదితర సమస్యలను ఎంపీలు అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నారు. కాగా.. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం సమర్పించనున్న బడ్జెట్‌లో రైల్వే కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో జోన్లు, రాష్ట్రాల వారీగా నిధులు, ప్రాజెక్టుల మంజూరు తదితరాలు ఉంటాయి. జోన్ల వారీగా నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల మంజూరుపై ఆయా రాష్ట్రాల నుంచి ప్రతిపాదనలు, వారిపై ఎంపీల ఒత్తిడి కీలక పాత్ర పోషిస్తుంది.
Read also: Governor Jishnu Dev Varma: సూర్యాపేట జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటన..
దశాబ్దాల క్రితం తెలంగాణకు మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణాలు సరైన పర్యవేక్షణ లేకపోవడంతో ఇప్పటికీ నత్తనడకన సాగుతున్నాయి. సర్వే స్థాయిలో ఉన్న వారు సాగదీయడానికే పరిమితమయ్యారు. కొత్త మంజూరు లేదు. తాజాగా డీఎం రైల్వే నిర్వహించిన సమావేశంలో… ముఖ్యమైన ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని ఎంపీలు పట్టుబట్టితే బడ్జెట్ లో రాష్ట్రానికి మంచి స్థానం దక్కే అవకాశాలున్నాయి. మరోవైపు ముంబైలో AC MMTS రైళ్లు ఉన్నాయి. హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో కూడా ఏసీ బోగీలను మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ మహానగరం విస్తరించనుంది. ఈ నేపథ్యంలో షాద్‌నగర్, భువనగిరి, సంగారెడ్డి వంటి పట్టణాలకు ఎంఎంటీఎస్ రైళ్లు నడిపేందుకు ప్రాజెక్టులు మంజూరు చేయాలి. శంషాబాద్ నుంచి విజయవాడ వరకు జాతీయ రహదారిపై కొత్త రైలు మార్గాన్ని త్వరగా పూర్తి చేయాలి. ఈ మార్గంలో రైల్వే లైన్ మంజూరైతే తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాల మధ్య దూరం తగ్గుతుంది.
KTR Tour: నేడు ఆదిలాబాద్ లో కేటీఆర్ పర్యటన.. రాంలీలా మైదానంలో బహిరంగ సభ..