NTV Telugu Site icon

ఇంట్లోనే గంజాయి మొక్కలను నాటిన ప్రబుద్ధుడు

పిచ్చి పలు రకాలు అని పెద్దలు అంటుంటారు. కొందరు వ్యక్తులు కూడా పిచ్చిగా ఏదేదో చేసేస్తుంటారు. హైదరాబాద్ నగరంలోని ఓ వ్యక్తి కూడా ఇలాగే పిచ్చి పని చేసి ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. జవహర్‌నగర్ పీఎస్ పరిధిలోని యాప్రాల్‌కు చెందిన వెంకటనరసింహశాస్త్రి (53) బేకరీ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే తనకు రోజూ నిద్ర పట్టడం లేదని.. ఎన్ని మందులు వాడినా ఫలితం దక్కలేదని.. ఎవరో చెబితే గంజాయి తాగాడు. ఆరోజు నిద్ర మంచిగా పట్టడంతో దానికి బానిసయ్యాడు.

Read Also: ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మారిన 12 ప్యాసింజర్ రైళ్లు

అయితే ఆ గంజాయి ఏదో తన ఇంట్లోనే పెంచుకుంటే సరిపోతుంది కదా అనే పిచ్చి ఆలోచన చేశాడు. తన దగ్గర దాచుకున్న గంజాయి విత్తనాలు నాటితే మొక్కగా పెరుగుతుందో లేదో అని ప్రయోగం చేద్దామనుకున్నాడు. ఇటీవల జూలైలో వెంకటనరసింహ శాస్త్రి మొదటి విత్తనం నాటగా గంజాయి మొక్క మొలిచింది. అనంతరం సెప్టెంబరులో మిగిలిన ఐదు విత్తనాలను నాటాడు. ఇంకో 15 రోజులైతే ఆ మొక్కలు అతడి చేతికి వచ్చేవి. కానీ ఇంట్లోనే గంజాయి పెంచుతున్నట్లు ఈలోపే పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.