NTV Telugu Site icon

Another Incident: హైదరాబాద్‌లో మరో దారుణం.. బాలికపై సామూహిక అత్యాచారం..

Harassed

Harassed

హైదరాబాద్‌లో వరుస అత్యాచార ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల అమ్నీషియా పబ్‌ రేప్‌ కేసు మరవకముందే రెండు రోజుల వ్యవధిలో రెండు అత్యాచార ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడు తాజా మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయిని సోషల్‌ మీడియాలో పరిచయం చేసుకొని నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కార్ఖానాకు చెందిన ఓ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో ధీరజ్‌, రితేష్ అనే ఇద్దరు యువకులు పరిచయమయ్యారు. అయితే.. ఆ పరిచయంతో ఓ హోటల్‌ అమ్మాయిని రప్పించారు ధీరజ్‌, రితేష్. ఆ హోటల్‌లో అమ్మాయిపై అత్యాచారానికి ఒడిగట్టారు.

అంతేకాకుండా అమ్మాయిపై నగ్నంగా వీడియోలు తీసి బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు దుర్మార్గులు. అంతేకాకుండా.. వీడియోలిస్తానని చెప్పి మరో లాడ్డికి పిలిచి మిత్రులతో ధీరజ్‌ గ్యాంగ్‌ రేప్‌ చేయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ తంతు రెండు నెలలుగా జరుగుతున్నా బాధితురాలు నోరు విప్పలేదు. బాలిక పరిస్థితి చూసిన తల్లిదండ్రులు సైక్రియాటిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. సైక్రియాటిస్ట్ ముందు తన గోడు బాధిత బాలిక వెళ్లబోసుకోవడం అసలు విషయం తెలిసింది. దీంతో మే 30న కార్ఖానా పోలీస్‌స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ మైనర్‌తో పాటు ఇద్దర్ని అరెస్ట్ చేశారు.