Site icon NTV Telugu

Former MLA Jeevan Reddy: మోకిలా పీఎస్లో విచారణకు హాజరైన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

Jeevanreddy

Jeevanreddy

Former MLA Jeevan Reddy: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మోకిలా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మోకిలలో 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో జీవన్ రెడ్డి విచారణకు హాజరు అయ్యారు. అయితే, గతంలో ల్యాండ్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుపై జీవన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. దీంతో ముందస్తు బెయిల్ పాటు అరెస్టు చేయవద్దంటూ సుప్రీంకోర్టును అతను ఆశ్రయించారు. అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్తు విచారణకు కావాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో మోకిలా పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు జీవన్ రెడ్డి. గతంలో భూ యజమానులతో పాటు మీడియాపై దాడులకు జీవన్ రెడ్డి అనుచరులు పాల్పడ్డారు.

Exit mobile version