LB Stadium: రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని మాజీ హోమ్ గార్డు వీరంజనేయులు ఎల్బీస్టేడియం వద్ద టవరెక్కి నిరసన తెలిపాడు. హైదరాబాద్ లో పలు పోలీస్టేషన్ లలో విధులు నిర్వహించిన ఆంజనేయులు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా విధులు నిర్వహించాడు.
Read also: Telangana Assembly 2024: నేడు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు రద్దు.. రైతు భరోసాపై చర్చ..
మాజీ హోమ్ గార్డు వీరాంజనేయులు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో 250 మంది హోమ్ గార్డులను అన్యాయంగా తొలగించారని నిరసన తెలిపాడు. 1 నుండి 10 సంవత్సరాలు విధులు నిర్వహించామని వాపోయాడు. అప్పట్లో అన్ని డిపార్ట్‌మెంట్ లలో విధులు నిర్వహించామన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం మాపై కక్ష గట్టి విధులనుండి తొలగించారన్నారు. మకందరికి గుర్తింపుగా సర్టిఫికెట్స్, బాంక్ అకౌంట్స్, హెల్త్ కార్డ్స్, ఉన్నాయని తెలిపారు.
Read also: Tamanna : నేను పెళ్లికి రెడీ.. తమన్నాకు ఫోటోగ్రాఫర్ ఆహ్వానం.. ఆమె ఏం చేసిందంటే ?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన సంవత్సరం గడుస్తున్నా పట్టించుకోవడం లేదని వాపోయాడు. అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250 మంది హోమ్ గార్డులను విధుల్లోకి తీసుకొని ఆదుకోవాలని ఆంజనేయులు డిమాండ్ చేశాడు.
రోడ్డుమీద పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని టవరెక్కిన మాజీ హోమ్ గార్డు నిరసన తెలిపాడు. ప్రభుత్వం ఆదుకోకపోతే కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మాజీ హోమ్ గార్డును కిందికి దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
School Holidays: ఏపీలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన..