NTV Telugu Site icon

Hyderabad: లక్డికాపూల్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు.. మిగిలిపోయిన ఫుడ్ ను స్టోర్ చేసి నెక్స్ట్ డే సర్వ్..

Food Sefty Officers

Food Sefty Officers

Hyderabad: హైదరాబాద్‌లోని హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు నాన్‌స్టాప్‌ దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన అధికారులు.. ఆహార భద్రతా జాగ్రత్తలు పాటించని పలు హోటళ్ల లైసెన్సులను రద్దు చేశారు. తాజాగా లక్డికాపూల్‌లోని పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. షాహి దస్తర్ ఖాన్, బడే మియా కబాబ్స్, ఖాన్ ఈ ఖాస్ రెస్టారెంట్లు ఆహార భద్రతా నియమాలను పాటించడం లేదని అధికారులు గుర్తించారు. దీంతోపాటు కబాబ్స్‌తోపాటు నాన్‌వెజ్‌ ఐటమ్స్‌లో సింథటిక్‌ ఫుడ్‌ కలర్స్‌ కలుపుతున్నారు. హోటళ్ల యజమానులు కస్టమర్ల జీవితాలతో ఆడుకుంటున్నారు. వంట గది పరిశుభ్రతపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ ప్రదేశంలో బొద్దింకలు, ఎలుకలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. గడువు ముగిసిన ముడిసరుకుతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. కాలం చెల్లిన మామిఎక్స్పైర్ అయిన మ్యాంగో మిల్క్, కోకోనట్ మిల్క్, కొరియా వాటర్ వాడుతున్నారు. మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో భద్రపరిచి మరుసటి రోజు అందించినట్లు అధికారులు తెలిపారు. స్టోర్ రూంలో ఫంగల్ అల్లం కనిపించింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆహార పదార్థాల్లో ఎక్కువ ఫుడ్ కలర్స్ వాడినందుకు హోటల్, రెస్టారెంట్ మేనేజర్లకు నోటీసులు జారీ చేశారు. ఆహార భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
TG Weather: తెలంగాణలో పెరిగిన చలి.. ఎజెన్సీ ప్రాంతాల్లో జనం విలవిల