Hyderabad: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్ కేసర్ పరిధిలోని ఔషపూర్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లల పంచాయతీ వల్ల ఏకంగా తండ్రి బలి అయ్యాడు. అయితే, ఇద్దరు చిన్నారులు గొడవ పడడంతో అమీర్ అనే వ్యక్తి మందలించాడు. ఇక, తన కొడుకునే మందలించాడనే కోపంతో అమీర్ ఇంటి మీదకు వెళ్ళి మరీ అలీ అనే వ్యక్తి దాడి చేశాడు. ఈ సందర్భంగా ఇరువురు ఒకరిపై ఒకరు దాడి చేసుకోగా.. వారి కుటుంబ సభ్యులు సర్ది చెప్పారు. ఇక, గొడవ పడిన తర్వాత తనకు ఛాతీలో నొప్పి వస్తుందని అమీర్ తన భార్యకు చెప్పాడు. దీంతో అతడ్ని తీసుకుని హుటాహుటిన ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు.
Read Also: EV Prices: ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై కేంద్రమంత్రి గడ్కరీ గుడ్ న్యూస్..
అయితే, అమీర్ ను ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే చనిపోయాడు. దీంతో అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, విషయం తెలుసుకున్న దాడికి పాల్పడిన అలీ స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అలీ దాడి చేయడంతోనే అమీర్ చనిపోయాడని అంటూ మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డు మీద కూర్చొని పెద్ద ఎత్తున నిరసన చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
