NTV Telugu Site icon

Bhatti Vikramarka: మహబూబ్‌నగర్‌లో రైతు దినోత్సవ సభ.. రాజధానిలో కార్నివాల్, లేజర్‌ షో

Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka: ప్రజా పరిపాలన విజయోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు. ఈ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులను భట్టి విక్రమార్క ఆదేశించారు. ఈ వేడుకల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్ నగర్ లో రైతు దినోత్సవం, వచ్చే నెల 7, 8, 9వ తేదీలలో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు మార్గాల్లో కార్నివాల్, లేజర్ షో, భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజాపరిపాలన ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా పథకాల వివరాలను ప్రజలకు చేరవేసేందుకు విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని, మహిళలు, చిన్నారులు భాగస్వాములు కావాలన్నారు. ఉత్సవాల్లో గ్రామం నుంచి మండల, జిల్లా స్థాయిల వరకు పెద్దఎత్తున కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. అన్ని విభాగాల విజయగాథలను తమ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించారు.
Astrology: నవంబర్‌ 23, శనివారం దినఫలాలు

Show comments