Site icon NTV Telugu

Fake Certificates: టెన్త్ 50 వేలు, ఇంటర్ 75 వేలు, డిగ్రీ 1.20 వేలు.. ఫేక్ సర్టిఫికెట్స్ ముఠా అరెస్ట్!

Fake

Fake

Fake Certificates: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగిలో టెన్త్, ఇంటర్, డిగ్రీ ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ముఠాను రాజేంద్రనగర్ ఎస్ఓటి పట్టుకున్నారు. నార్సింగిలో ఓ స్థావరంపై దాడి చేసిన ఎస్ఓటీ.. ఫేక్ సర్టిఫికెట్లు విక్రయిస్తుండగా మిర్జా అక్తర్ అలీ బేగ్ అలియాస్ అస్లాం, మమ్మద్ అజాజ్ అమ్మద్, వెంకట్ సాయి, రోహిత్ కుమార్, ప్రవీణ్ అనే ఐదుగురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక, నిందితుల దగ్గర నుంచి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ నకిలీ విద్యా సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.

Read Also: iBomma Ravi : ఐబొమ్మ రవి ఐదోరోజు కస్టడీ విచారణ.. కీలక విషయాలు బయటకు

అలాగే, ఎస్ఆర్ఎం యూనివర్శిటీ, బెంగుళూరు సిటీ యూనివర్శిటీకి చెందిన ఫేక్ సర్టిఫికెట్లను కూడా రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. ఇక, ఈ నకిలీ సర్టిఫికెట్లతో పాటు ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్స్, బోనాఫైడ్ సర్టిఫికెట్లను హస్తగతం చేసుకున్నారు. అంగట్లో సరుకుల ఫేక్ విద్యా సర్టిఫికెట్లు విక్రయిస్తున్న ఈ గ్యాంగ్.. కేవలం 50 వేలకు టెన్త్, 75 వేలకు ఇంటర్, 1. 20 లక్షలకే డిగ్రీ సర్టిఫికెట్లను అమ్మకానికి పెట్టారు. గత కొంత కాలంగా నకిలీ ధ్రువపత్రాలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుంది ఈ ముఠా.. ఒరిజినల్ సర్టిఫికెట్లు మాదిరిగా ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాను నార్సింగి పోలీసులకు అప్పగించడంతో.. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version