CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. కంపెనీ ప్రతినిధులతో ఒకరి తర్వాత ఒకరు చర్చలు జరుపుతున్నారు. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నారు. రాష్ట్రానికి వస్తే తగిన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రాయితీ కల్పిస్తామన్నారు. అయితే సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో బిజీ బిజీ ఉంటే కొందరు సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్ లో ఎలాంటి మార్పు లేదని కాంగ్రెస్ వర్గీయులు తెలిపారు.
Read also: YS Jagan: నేడు నంద్యాల జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటన రద్దు చేసుకున్నారంటూ కొందరు సోషల్ మీడియా పనిగట్టుకుని చేస్తున్న అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దంటూ అన్నారు. అవాస్తవాలను ప్రచారం చేస్తూ మీడియాను, ప్రజలను గందరగోళంలో పడేసే ప్రయత్నం చేస్తున్న వారి ట్రాప్ లో పడొద్దని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి షెడ్యూల్ ప్రకారం తన పర్యటన పూర్తి చేసుకున్న తరువాతే రాష్ట్రానికి చేరుకుంటారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13న తన పర్యటన ముగించుకుని 14న ఉదయానికల్లా హైదరాబాద్ చేరుకుంటారని దయచేసి గమనించగలరు.
Read also: PM Modi: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతకి మోడీ అభినందనలు..
ఇవాళ గూగుల్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ఆ తర్వాత సీఎం స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలోని బయోడిజైన్ సెంటర్‌కి వెళ్లనున్నారు. యూనివర్సిటీలోని సస్టైనబిలిటీ డీన్ అరుణ్ మజుందార్, ప్రొఫెసర్ రాజ్ దత్‌తో వివిధ అంశాలపై చర్చిస్తారు. అక్కడ పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తగిన అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. గూగుల్ ప్రతినిధులతో సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెజాన్ గ్లోబల్ డేటా సెంటర్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్‌తో సమావేశం కానుంది. ఆ తర్వాత Z స్కాలర్ జై చౌదరిని, కంపెనీ వ్యవస్థాపకుడు మరియు CEO కలుస్తారు. ఎనోవిక్స్, ఫిషర్ సైంటిఫిక్, మోనార్క్ ట్రాక్టర్స్ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ప్రొఫెసర్ సాల్మన్ స్మార్ట్ విలేజ్ మూమెంట్స్‌లో డార్విన్‌ను కలుసుకున్నాడు. అనంతరం ప్రవాస భారతీయులతో ఆత్మీయ సమ్మేళనం ఉంటుంది.
Food Poison : విషాదం.. మధ్యాహ్న భోజనం తిన్న దాదాపు 100 మంది విద్యార్థులకు అస్వస్థత