Site icon NTV Telugu

Liquoe Parties: దావత్‌లపై ఆబ్కారీశాఖ ఫోకస్.. రాష్ట్రంలోని లిక్కర్ మాత్రమే అనుమతి..

Liquoe Parties

Liquoe Parties

Liquoe Parties: తెలంగాణలో ఏ ఫంక్షన్‌కైనా దావత్ జరగాల్సిందే. తెలంగాణలో పండగ అయినా, ఫంక్షన్ల అయినా, దావత్ లు ఇలా సందర్భం ఏదైనా సరే మేకలు, గొర్రెల తలలు తెగాల్సిందే. మటన్ ముక్క లేనిది దావత్ ఉండదంటే ఆశ్చర్యపోవాల్సిందే. మటన్ తో మందు ఉంటే ఆ సందడే వేరబ్బా.. మటన్ ముక్క.. మందు చుక్క.. పార్టీ లేకుండా తెలంగాణలో పార్టీనే ఉండదు. దీంతో రాష్ట్రంలో మద్యం విక్రయాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇక నుంచి రాష్ట్రంలో జరిగే ప్రైవేట్ పార్టీలపై అబ్కారీ శాఖ దృష్టి సారిస్తుంది. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం వినియోగంపై ఇప్పటికే అబ్కారీ శాఖ కొరడా ఝులిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఫంక్షన్లు, పార్టీలపై కూడా అబ్కారీ శాఖ ఓ కన్నేసి ఉంచనుంది. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయనుంది. వాస్తవానికి ఏ కార్యక్రమంలోనైనా మద్యం సేవించాలంటే ఎక్సైజ్ శాఖ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి. పార్టీలలో రాష్ట్ర మద్యం మాత్రమే వాడాలి.

Read also: Donald Trump : డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన దాడిపై స్పందించిన బిడెన్-ఒబామా.. ఏమన్నాంటే ?

కానీ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్న కొందరు… ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ ధరకు మద్యాన్ని తెస్తున్నారు. మద్యం రేటు తక్కువగా ఉన్న గోవా, యానాం వంటి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి రహస్యంగా మద్యం తీసుకొచ్చి పార్టీల్లో ఎక్కువ రేటుతో వినియోగిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుంది. దీని వల్ల ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు బృందాలు సిద్ధమయ్యాయి. నాన్‌ డ్యూటీ పెయిడ్‌ మద్యం సేవించడం, దావత్‌లు, కార్యక్రమాలకు అనుమతి తీసుకోకపోవడంపై ఈ ఏడాది 302 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 165 మందిని నిందితులుగా గుర్తించి 35 వాహనాలను సీజ్ చేశారు. రూ.61.13 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పార్టీలు, దావత్‌లపై కఠిన నిఘా ఉంటుందని ఎక్సైజ్ శాఖ హెచ్చరిస్తోంది.
CM Revanth Reddy: రంగారెడ్డిలో సీఎం పర్యటన.. ‘కాటమయ్య రక్ష’ కిట్లను ప్రారంభం..

Exit mobile version