ACP Sabbathi Vishnumurthy: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా విడుదల సమయంలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటనపై మీడియా సమావేశంలో నటుడు అల్లు అర్జున్‌ను ప్రెస్ మీట్ పెట్టి మరీ తిట్టిన డైనమిక్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి తాజాగా కన్నుమూశారు. ఆయన సుదీర్ఘకాలంగా పోలీస్ శాఖలో కీలక పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. ప్రజలకి అందించే సేవలో, విధుల్లో కట్టుబడి, నిఖార్సైన పోలీస్ విధానాలతో ప్రజల భద్రత కోసం నిత్యం కృషి చేశారు. అయితే, హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి సబ్బతి విష్ణుమూర్తి గుండెపోటుతో మరణించారు. ఇక, పోలీస్ శాఖలో ఆయన చేసిన సేవలను, సామాజిక, కార్య నిర్వహణలో ఆయన చూపిన ప్రతిభను స్మరిస్తూ పలువురు నివాళులు ఆర్పిస్తున్నారు.