NTV Telugu Site icon

TG DSC Exams: నేడే తెలంగాణ డీఎస్సీ పరీక్షలు.. 10నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి..

Tg Dsc Exams 2024

Tg Dsc Exams 2024

TG DSC Exams: ఎట్టకేలకు డీఎస్సీ అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. డీఎస్సీని వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేసిన ప్రభుత్వం త్వరలో మరో డీఎస్సీని ప్రకటించి నేటి నుంచి పరీక్షలను నిర్వహించనుంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు ఒక సెషన్‌, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు మరో సెషన్‌ ఉంటుంది. కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులకు మాత్రం అరగంట ఎక్కువసేపు పరీక్ష నిర్వహించనున్నారు. అభ్యర్థులను ఉదయం 7:30 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.

Read also: CM Chandrababu: మరో శ్వేతపత్రం విడుదల చేయనున్న ఏపీ సీఎం.. నేడు శాంతిభద్రతలపై

అభ్యర్థులు పరీక్షకు పది నిమిషాల ముందు కేంద్రాలకు చేరుకోవాలని, ఆ తర్వాత అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, పేజర్లు, సెల్ ఫోన్లు, చేతి గడియారాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, వ్యక్తిగత వస్తువులను అనుమతించబోమని తెలిపింది. అభ్యర్థులు తమ హాల్ టికెట్ మరియు వ్యక్తిగత గుర్తింపు కార్డును తనిఖీ చేసిన తర్వాత మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబడతారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఐదుగురికి మించి హాజరుకాకూడదని సూచించారు. అలాగే పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ షాపులను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. నేటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని స్పష్టం చేశారు.

Read also: Astrology: జులై 18, గురువారం దినఫలాలు

ఏడాది క్రితం సెప్టెంబరులో గత ప్రభుత్వం ఐదు వేలకు పైగా పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ వివిధ కారణాల వల్ల పోస్టులు భర్తీ కాలేదు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆర్థిక శాఖ ఆమోదించిన 5,976 పోస్టులకు కలిపి మొత్తం 11,056 పోస్టులతో ఫిబ్రవరి 29న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 2,629 స్కూల్ అసిస్టెంట్, 727 భాషా పండితులు, 182 PET, 6,508 SGT, 220 మరియు 796 SGT పోస్టులు స్కూల్ అసిస్టెంట్ ప్రత్యేక కేటగిరీలో ఉన్నాయి.డీఎస్సీ రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2 లక్షల 79 వేల 956 మంది దరఖాస్తు చేసుకోగా నిన్న సాయంత్రం వరకు దాదాపు రెండున్నర లక్షల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు రాయాల్సిన వారు ఒకే కేంద్రంలో పరీక్ష రాసేందుకు వెసులుబాటు కల్పించినట్లు విద్యాశాఖ తెలిపింది.
Release clash : దీపావళి రేస్ మొదలు పెట్టిన హీరో..ఆ హీరో ఎవరంటే..?