NTV Telugu Site icon

DGP Jitender Reddy: జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన.. 20 టన్నుల గంజాయి సీజ్..

Telangana Dgp

Telangana Dgp

DGP Jitender Reddy:జీరో శాతం డ్రగ్స్ నిర్మూలన చేశామని, 20 టన్నుల గాంజాయి సీజ్ చేశామని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. లక్డీకపూల్ డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డీజీపీ మాట్లాడుతూ.. తెలంగాణలో శాంతిభద్రతలపై డీజీపీ మాట్లాడుతూ.. మైనర్ ఘటనలు మినహా 2024 శాంతిభద్రతలు కాపాడామన్నారు. రాష్ట్రంలో మతపరమైన కమ్యునల్ సమస్యలు లేవని తెలిపారు. పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుమన్నారు. అమాయక ప్రజలను నక్సల్స్ హతమార్చారని, పోలీస్ కూంబింగ్ చేయాల్సి వచ్చిందన్నారు. 0 శాతం డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీస్ తగిన చర్యలు తీసుకుందన్నారు.

Read also: జనవరి నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..

ఈ ఏడాది గంజాయి 1950 కేసులు నమోదు అయ్యాయి, కేసులు పెరిగాయని తెలిపారు. 20 టన్స్ గాంజాయి సీజ్ చేసామమన్నారు. స్పెషల్ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ నిర్మూలన కృషి చేస్తుందని డీజీపీ తెలిపారు. 48 డ్రగ్ కేసుల్లో నిందితులకు శిక్ష పడిందన్నారు. ఇతర స్టేట్ నుండి గంజాయి రవాణా కట్టడి చేసామని తెలిపారు. రూ.142 కోట్ల విలువ చేసే గంజాయి సీజ్ చేసామన్నారు. రూ.5.5 కోట్ల ప్రాపర్టీ సీజ్ చేసాము ndps కేసులు నమోదు చేసామని తెలిపారు. సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందన్నారు. దేశంలో మొదటి సారి 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుండి కాపాడమని తెలిపారు. రూ.180 కోట్ల నగదు బాధితులకు అందజేశమన్నారు.

Read also: Tirumala Special Days 2025: జనవరి మాసంలో తిరుమలలో జరిగే విశేష పర్వదినాలు ఇవే..

రూ.10 వేల ఐ ఎం ఈ ఏ నెంబర్లు బ్లాక్ చేసామన్నారు. హత్య కేసులు పెరిగాయయని తెలిపారు. 856 హత్య కేసులు నమోదు అయ్యాయని అన్నారు. 8 కేసుల్లో రౌడి షీటర్ ఇన్వాల్వ్ అయ్యారు. దొంగతనాల సెల్ ఫోన్ చోరీ కేసులు పెరిగాయన్నారు. అత్యాచార కేసులు పెరిగాయని తెలిపారు. 1% కేసుల్లో తెలియని వ్యక్తుల ప్రమేయం ఉంది, 99% అత్యాచార కేసుల్లో తెలిసిన వారి ప్రమేయం వల్ల జరిగాయని తెలిపారు. నేరగాల్లపై 3,390 సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసామని డీజీపీ తెలిపారు. మహిళలపై వివిధ కారణాల వల్ల జరిగిన కేసుల్లో 4.7% క్రైమ్ రేట్ పెరిగిందన్నారు.

మైగ్రేన్‌ తలనొప్పితో బాధ పడుతున్నారా? ఇలా ట్రై చేయండి

Show comments