Devineni Avinash: దేవినేని అవినాష్‌కు చుక్కెదురు.. దుబాయ్‌ వెళ్లకుండా అడ్డుకున్న అధికారులు..

  • వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురు..
  • దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించిన అవినాష్‌..
  • అడ్డుకున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు..
  • టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో అవినాష్‌పై లుకౌట్‌ నోటీసులు..
Devineni Avinash

Devineni Avinash

Devineni Avinash: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దేవినేని అవినాష్‌కు చుక్కెదురైంది.. గురువారం రాత్రి.. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు ప్రయత్నించారు అవినాష్‌.. అయితే, ఆయన్ని అడ్డుకున్న శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు.. వెంటనే మంగళగిరి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. అయితే, దేవినేని అవినాష్‌పై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొదని స్పష్టం చేశారు పోలీసులు.. కేసులు ఉన్న నేపథ్యంలో ప్రయాణం చేయడం కుదరదని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తేల్చేశారు.. కాగా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్‌పై లుకౌట్‌ నోటీసులు జారీ చేశారు పోలీసులు.. ఇక, ఈ కేసులో వైసీపీ నేతలు విదేశాలకు వెళ్లిపోకుండా.. ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు.. ఇదే సమయంలో హైదరాబాద్‌ నుంచి దుబాయ్‌ వెళ్లేందుకు దేవినేని అవినాష్‌ ప్రయత్నించడం.. ఎయిర్‌పోర్ట్‌ అధికారులు అడ్డుకోవడంతో.. ఆయనకు చుక్కెదురైనట్టు అయ్యింది.