Inter Admissions: ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..
- ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్స్ గడువు మరోసారి పొడిగింపు..
- 5 వందల ఆలస్య రుసుముతో వచ్చే నెల 15 వ తేదీ వరకు పొడిగింపు..
- సుమారు 70 వేల మంది విద్యార్థులు ఆ కాలేజీల్లో చేరి ఉంటారని అంచనా...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Inter Admissions: ఇంటర్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల గడువును బోర్డు మరోసారి పొడిగించింది. రూ.500 ఆలస్య రుసుముతో వచ్చే నెల (అక్టోబర్ 15) వ తేదీ వరకు పొడిగించింది. ఇంకా 3 వందలకు పైగా కాలేజీల అనుబంధ గుర్తింపు పెండింగ్ లో ఉండటంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ నుండి మినహాయింపు ఇస్తే తప్ప.. వాటికి అనుబంధ గుర్తింపు రాని పరిస్థితి ఏర్పడింది. సుమారు 70 వేలకు పైగా విద్యార్థులు ఆ కాలేజీల్లో చేరి ఉంటారని అంచనా వేస్తున్నారు అధికారులు. అయితే సెప్టెంబర్ 23న ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్ల గడువును బోర్డు పొడిగించిన విషయం తెలిసిందే. రూ.500 ఆలస్య రుసుముతో రెండో విడత అడ్మిషన్ల గడువుకు 30 వరకు అవకాశమిచ్చింది.
అయితే 3 వందలకు పైగా కాలేజీల అనుబంధ గుర్తింపు పెండింగ్ లో వున్న దృష్ట్యా బోర్డు మరోసారి అడ్మిషన్లు గడువు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొందరు విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 30వరకు బోర్డు అడ్మిషన్లకు డెడ్ లైన్ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బోర్డు ఇప్పుడు మళ్లీ గడువును మరోసారి పొడిగించడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రం ఆలస్య రుసుము తీసుకోరు. కేవలం ప్రైవేట్ కాలేజీల్లో చేరేవారు మాత్రమే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.కాగా.. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో జనరల్ కోర్సుల్లో 60,525 మంది, వొకేషనల్ కోర్సుల్లో 21,957 మంది చొప్పున మొత్తంగా 70వేలకు పైగా విద్యార్థులు ప్రవేశాలు పొందినట్లు విశ్వనీయ సమాచారం.
Bus Accident: ట్రావెల్స్ బస్సును ఢీకొట్టిన కంటైనర్ లారీ.. ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు
Also Read
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!