NTV Telugu Site icon

NTV Effect: జేఎన్టీయూ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్‌. క్యాంపస్‌ కు అడిషనల్ కలెక్టర్..

Jntu Campus

Jntu Campus

NTV Effect: సుల్తాన్ పూర్ JNTU ఘటనపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్ అయ్యారు. ఇవాళ చట్నీలో ఎలుక ఈత కొడుతున్న వీడియోను కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ ఘటనపై ఎన్ టీవీ సోషల్ మీడియా వేదికగా ప్రచురించింది. ఈ వార్తపై వెంటనే స్పందించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులపై సీరియస్‌ అయ్యారు. వెంటనే సుల్తాన్‌ పూర్‌ జేన్టీయూని సందర్శించాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం జేఎన్టీయూ క్యాంపస్ కు చేరుకున్నారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు ఇవాళ జేఎన్టీయూ క్యాంపస్ కి వచ్చి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Read also: Thummala Nageswara Rao: సీతారామ ప్రాజెక్టు పంపు హౌస్ కోసం చైనా నుంచి ఇంజనీర్ లు..

విద్యార్థుల భోజనంలో బల్లులు, బొద్దింకలు, ఎలుకలు వస్తున్నాయని వాపోయారు. ఈ ఘటనలు కొద్దొరోజులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రిన్స్ పాల్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మాధురి క్యాంపస్ కిచెన్ ను సందర్శించారు. కిచెన్ పరిశుభ్రంగా లేకపోవడంతో అడిషనల్ కలెక్టర్ మాధురి ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట గదిలో కనీస జాగ్రత్తలు పాటించారా? అని ప్రిన్సిపాల్, మెస్ కాంట్రాక్టర్ పై ఫైర్‌ అయ్యారు. మెస్ కాంట్రాక్టర్ ని మార్చాలని ప్రిన్సిపాల్ కి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులే కావాలని చట్నీలో వేశారని ప్రిన్సిపాల్ చెప్పగా.. తినే ఆహారంలో విద్యార్థులు ఎందుకు వేస్తారని జిల్లా అడిషనల్ కలెక్టర్ నిలదీయడంతో ప్రిన్సిపాల్ బదులు చెప్పలేక పోయారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చారించారు. తమ సమస్యలను వెంటనే స్పందించి పరిష్కరించిన వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు, ఈ వార్తను ప్రచురించిన ఎన్ టీవీ యాజమాన్యానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.
Instagram Reels: అయ్యిందా బాగా అయ్యిందా.. ఇప్పుడు చల్లు రోడ్డుపై నోట్లు..