Site icon NTV Telugu

Cyber ​​Security SP: తెలంగాణలో ఆన్‌లైన్ గేమింగ్ బ్యాన్..

Cyber Security

Cyber Security

Cyber ​​Security SP: బెట్టింగ్ యాప్స్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యపై సరైన క్లారిటీ లేదు అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అడిషనల్ ఎస్సీ ప్రసాద్ అన్నారు. 2017 గేమింగ్ యాక్ట్ ప్రకారం తెలంగాణాలో ఆన్లైన్ గేమింగ్ బ్యాన్ అయింది.. మొత్తం 108 ఇల్లీగల్ Ursలను బ్లాక్ చేశాం.. చైనీస్ urlలను ఫాలో కాకుండా అనేక ఇల్లీగల్ Urs లను పంపుతున్నారు.. ప్రజలకు తమ మొబైల్స్ ద్వారా వచ్చే పాప్ అప్స్ పైనా సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేస్తే వాటిని బ్లాక్ చేస్తామన్నారు. వేరు వేరు ప్రాంతల నుంచి ఫేక్ జీపీఎస్ ద్వారా జీయో ఫెన్సింగ్ యాక్సెస్ జరుగుతుంది.. స్కిల్ గేమింగ్ అని చెప్పే మాటలు అబద్దం.. ఆన్లైన్ గెమింగ్ ద్వారా నష్టపోయిన ఒక్క గెమింగ్ కంపెనీ లేదని పేర్కొన్నారు.

Read Also: Parigi : హైడ్రా రాకున్నా రెవెన్యూ అధికారుల దూకుడు..

అయితే, గేమింగ్ కంపెనీ ఏర్పాటు చేసిన సాఫ్ట్ వేర్ వారు పన్నిన పన్నాగం మాత్రమే.. స్కిల్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలి అని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అడిషనల్ ఎస్సీ ప్రసాద్ సూచించారు. స్కిల్ గేమ్, నాన్ స్కిల్ గేమ్స్ తో సంబంధం లేదు.. ప్రతి ఆన్లైన్ గేమ్ వలన నష్టాలు ఉన్నాయి.. స్కిల్ గేమ్స్, నాన్ స్కిల్ గేమ్స్ పైనా లీగల్ అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పుకొచ్చారు. భారత చట్టాల ప్రకారం ఇన్ఫ్లుయెన్సర్లపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

Exit mobile version