NTV Telugu Site icon

CV Anand: వచ్చే ఏడాది నుంచి పద్ధతి మారాలి.. భక్తులకు సీవీ ఆనంద్ విజ్ఞప్తి

Cv Ananad

Cv Ananad

CV Anand: వచ్చే ఏడాది నుంచి అయినా ఈ పద్ధతి మానుకోవాలని, 11వ రోజే నిమజ్జనం పూర్తి చేసేలా తరలి రావాలని కోరుతున్నానని భక్తులకు సీపీ సీవీ ఆనంద్ విజ్ఞప్తి చేశారు. ఇంకా వెయ్యి విగ్రహాల వరకు నిమజ్జనం కోసం ఉన్నాయని త్వరగా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేస్తున్నామని అన్నారు. వినాయక నిమజ్జనం కోసం ప్రభుత్వం ఒకరోజు సెలవు కూడా ఇస్తోందని గుర్తు చేశారు. కానీ కొందరు శోభాయత్రలను సెలవు రోజు అర్ధరాత్రి, తెల్లవారుజామున స్టార్ట్ చేస్తున్నారని అన్నారు. ఇలా చేయడం వల్ల నిమజ్జనం మరుసటిరోజు సాయంత్రం వరకు జరుగుతోందని తెలిపారు. దీనివల్ల నిమజ్జనం ఆలస్యం అవడంతోపాటు.. సామాన్య జనులకు కూడా ఇబ్బంది అవుతోందని అన్నారు. వచ్చే ఏడాది నుంచి అయినా ఈ పద్ధతి మానుకోవాలి.. 11వ రోజే నిమజ్జనం పూర్తి చేసేలా తరలి రావాలని సీవీ ఆనంద్ కోరారు.

Read also: Hyderabad : జానీ మాస్టర్‌కు పోలీసుల నోటీసులు.. పరారీలో జానీ

ట్యాంక్ బండ్ పై బందోబస్తు పరంగా పూర్తి స్థాయిలో ఉందని అన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రయాణికులకు పంపిస్తున్నామన్నారు. ఉదయం 10.30 నుంచి అన్ని జంక్షన్స్ లో ట్రాఫిక్ రిలీజ్ చేసామన్నారు. గత ఏడాది కన్నా ముందే ట్రాఫిక్ క్లియరెన్స్ ఇచ్చామన్నారు. దాదాపుగా అన్ని ఫ్లై ఓవర్ లు వదిలేసామన్నారు. ప్రణాళిక ప్రకారం ఖైరతాబాద్ గణపతి ఉదయం 6.30 కి మొదలుకుని మధ్యాహ్నం 1.30 కి నిమజ్జనం పూర్తి అయ్యిందన్నారు. ఉత్సవ కమిటీ కి ధన్యవాదాలు తెలిపారు. మా టీం లా అండ్ ఆర్డర్ అధికారులు చాలా బాగా కృషి చేశారన్నారు. సౌత్ వెస్ట్ లో కొన్ని మండపాల నిర్వాహకులు ఇంకా ముందుకు రాలేదు… వారు అర్దం చేసుకోవాలని తెలిపారు. నిన్న సెలవు ప్రకటించి నిమజ్జనం చేసుకున్నాం… కానీ ఇష్టానుసారంగా వ్యవహరించారు.. కొందరు అంటూ సీరియస్ అయ్యారు. పోలీసులకు, GHMC అధికారులకు సహకరించాలన్నారు.

Read also: Road Accident: తెలంగాణలో వరుస రోడ్డు ప్రమాదాలు.. 5 గురు మృతి, పలువురికి గాయాలు.

హుస్సేన్ సాగర్ లో 5500 విగ్రహాలు నిమజ్జనం అయ్యింది… ఇవన్నీ రికార్డులో ఉన్నాయన్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా గణేస్ నిమజ్జనానికి వచ్చారని… అవి దాదాపుగా 15 వేల వరకు ఉంటాయని అంచనా వేశారు. 15-20 అడుగుల విగ్రహాలు కొన్ని వచ్చి కొన్ని ప్లేస్ లలో ఆగిపోయాయన్నారు. అబిడ్స్ లో అలాగే కొన్ని ప్రాంతాల్లో టస్కర్ లు, వాహనాలు కండిషన్ బాగోలేక ఆగిపోయాయని క్లారిటీ ఇచ్చారు. లేకపోతే ఇంకా త్వరగా నిమజ్జనం పూర్తి అయ్యేవని అన్నారు. మా లా అండ్ ఆర్డర్… మిగితా పోలీసు అధికారులు, GHMC మిగితా అన్ని విభాగాల అధికారులు అందరూ 40 గంటలకు పైగా పని చేస్తున్నారని.. వారందరికీ అభినందనలు తెలిపారు. చిక్కడపల్లి, ఈస్ట్ జోన్ లో కొన్ని సమస్యలు వచ్చాయని.. తాగి గొడవలయ్యాయని తెలిపారు. మొత్తం 10 రోజుల్లో హుస్సేన్ సాగర్ లేక్ లో లక్ష విగ్రహాలు నిమజ్జనం అయ్యాయని, 10 పోలీసు సిటీ వాళ్ళు మిగితా ఇంకో 10 వేలు.. ఇతర జిల్లాల వారు పోలీసులు ఉన్నారని పేర్కొన్నారు.
Tank Bund Updates: ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్..

Show comments