Site icon NTV Telugu

CS Shanti Kumari: ఈనెల 28న రాష్ట్రానికి రాష్ట్రపతి.. అధికారులతో సీఎస్ సమీక్ష..

Cs Shanti Kumari

Cs Shanti Kumari

CS Shanti Kumari: ఈ నెల 28న తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ సందర్భంగా అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. చేపట్టాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రపతి రాష్ట్రంలో ఒకరోజు పర్యటన సందర్భంగా ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారని తెలిపారు. సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను రాష్ట్రపతి ప్రారంభిస్తారని తెలిపారు. శాఖల మధ్య సంపూర్ణ సమన్వయం ఉండేలా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రపతి నిలయంలో పాములు పట్టేవారిని నియమించాలని తెలిపారు. అలాగే రాష్ట్రపతి నిలయం పరిసర ప్రాంతాల్లో కోతుల బెడద, తేనెటీగలు వంటి వాటి నివారణకు ప్రత్యేక బృందాలను జీహెచ్‌ఎంసీ సమన్వయంతో నియమించాలని అటవీ శాఖను ఆదేశించారు. సందర్శనకు వెళ్లే అన్ని ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ శాఖకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth Reddy: జమిలి ఎన్నికల అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..

Exit mobile version