Site icon NTV Telugu

వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం.. షాకైన సిబ్బంది..

ముషీరాబాద్ హరినగర్ రీసాలగడ్డ వాటర్ ట్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వాటర్ ట్యాంక్ ను శుభ్రం చేయడానికి వచ్చిన వాటర్ వర్క్స్ సిబ్బందికి మృతదేహం కనిపించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే సిబ్బంది వాటర్ వర్క్స్ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ రవి చారి, వాటర్ వర్క్స్ ఇన్ స్పెక్టర్ లు చేరుకున్నారు.

ట్యాంక్‌పై చెప్పులు ఉండడంతో అవి మృతునికి సంబంధించినవిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతునికి సంబంధించిన ఆనవాళ్లు చెప్పులను బట్టి మృతుని వయసు 35 నుండి 40 సంవత్సరాలు ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే మృతదేహాన్ని బయటకు తీసేందుకు ఎన్టీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ విషయం తెలియడంతో ఘటన స్థలం వద్దకు పెద్ద ఎత్తున్న స్థానికులు చేరుకున్నారు.

Exit mobile version