NTV Telugu Site icon

మారని విద్యాసంస్థల తీరు.. పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

కరోనా మహమ్మారి దెబ్బకు ఏకంగా భారత దేశ ఆర్ధిక పరిస్థితే దెబ్బతింది. కోవిడ్‌ ధాటికి పేద, మధ్యతరగతి కుటుంబాల్లో చదువుకుంటున్న విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఫీజులపై విద్యార్థులను ఒత్తిడి గురిచేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కూడా ఈ దేశాలను విద్యాసంస్థలను ప్రభుత్వం జారీ చేసింది. అయినప్పటికీ కొన్ని విద్యాసంస్థలు వాటి తీరును మార్చుకోకపోవడం శోచనీయం. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో శంకర్‌జీ మెమోరియల్‌ హై స్కూల్‌ను నిర్వహిస్తున్నారు.

అయితే తాజాగా ఈ స్కూల్‌ యాజమాన్యం కొందరు విద్యార్థులు ఫీజులు కట్టలేదని పరీక్షలు రాయనీయకుండా బయట నిలబెట్టారు. ఫీజులు కడితేనే పరీక్షలు రాయనిస్తామని యాజమాన్యం తెలిపింది. దీంతో విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకొని పాఠశాల చైర్మన్‌, ప్రిన్సిపాల్‌ ఛాంబర్లలో నిరసన చేపట్టారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పనులు లేక అధిక ఫీజులు చెల్లించే పరిస్థితి లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.