Site icon NTV Telugu

Hyderabad: ట్యూషన్ టీచర్ ఘరానా మోసం.. విద్యార్థి నుంచి రూ.లక్షల్లో కాజేత.. చివరికిలా..!

Hyderabadteacher

Hyderabadteacher

విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సన్మార్గంలో పెట్టాల్సిన గురువే గాడి తప్పాడు. విద్యార్థులకు పాఠాలు బోధించి ప్రతిభావంతులకు తీర్చిదిద్దాల్సిన పంతులు ఘరానా మోసానికి తెరలేపాడు. ట్యూషన్‌కు వచ్చే ఒక స్టూడెంట్‌ను ట్రాప్ చేసి రూ.లక్షల్లో కాజేశాడు. విద్యార్థి తండ్రి అప్రమత్తతతో సదరు ఉపాధ్యాయుడి బాగోతం బయటపడింది.

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్ పరిధిలోని జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి.. సందీప్ అనే టీచర్‌ దగ్గరకు ట్యూషన్‌కు వెళ్తున్నాడు. విద్యార్థి స్టేటస్ గమనించిన సదరు ఉపాధ్యాయుడు ట్రాప్‌లో పడేశాడు. అవసరం పేరుతో డబ్బులు అడిగేవాడు. పాపం పుణ్యం ఎరుగని చిన్నారి.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా డబ్బులు తీసుకొచ్చి టీచర్‌కు ఇస్తుండేవాడు. ఇలా విద్యార్థి నుంచి రూ.లక్షల్లో కాజేశాడు.

ఇది కూడా చదవండి: NTR 31 : ఎన్టీఆర్ – నీల్ సినిమా రిలీజ్ డేట్ మారింది.. టీజర్ డేట్ వచ్చింది

తాజాగా ఐఫోన్ సైతం ట్యూషన్ టీచర్‌కు ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. తనకు ఐఫోన్ వద్దని.. డబ్బులు కావాలంటూ మొబైల్ షాపుకు వెళ్లి బేరం పెట్టాడు. దీంతో షాపు ఓనర్‌కు అనుమానం వచ్చి.. బాలుడు తండ్రి కమల్‌జైన్‌కు సమాచారం ఇచ్చాడు. విషయం తెలిసి ఒక్కసారిగా కమల్‌జైన్ షాక్ అయ్యాడు. వెంటనే జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు పట్టించుకోలేదు. దీంతో విసుగెత్తిన కమల్‌జైన్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశాడు. ఊహ తెలియని బాలుడిని టీచర్ సందీప్ ట్రాప్ చేసి రూ.లక్షల్లో డబ్బు కాజేసినట్లుగా కమల్‌జైన్ ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: NANI : మే1న నానిపై ముప్పేట దాడి.. తట్టుకోగలడా

Exit mobile version