NTV Telugu Site icon

RJ Ventures: ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం.. 600 మంది నుండి రూ.150 కోట్లు వసూలు..

Rj Ventures

Rj Ventures

RJ Ventures: ప్రీ లాంచింగ్ పేరిట భారీ మోసం హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఆర్జే వెంచర్స్ యాజమాన్యం సుమారు 600 మంది నుండి 150 కోట్లు వసూలు చేసినట్లు సంచలన విషయాలు బయటకు రావడంతో పోలీసులు షాక్‌ అయ్యారు. బాధితులు అందరూ బషీర్ బాగ్ పోలీస్టేషన్‌ క్యూ కట్టారు. పోలీస్టేషన్‌ ముందు ఆర్జే బాధితులు అంటూ బ్యానెర్ తో ఆందోళనకు దిగారు. దీంతో బషీర్ బాగ్ పోలీస్టేషన్‌ వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. నారాయణఖేడ్, ఘట్కేసర్ , పటాన్ చెరువు, కర్తను ప్రాంతాలలో అపార్ట్మెంట్ , ఫార్మ్ ల్యాండ్ పేరిట ప్రముఖులతో ఆర్జే వెంచర్స్ ప్రకటనలు చేశారు. దీంతో 2020 లో తాము నమ్మి ఒక్కొక్కరం 20 లక్షల నుండి 50 లక్షల వరకు కట్టామని బాధితులు లబోదిబో మన్నారు. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని వాపోయారు.

Read also: Adilabad: మహారాష్ట్రకు మగ పులి.. మరి ఆడ పులి ఎక్కడ?

వెంచర్ ఎండి భాస్కర్ గుప్త, డైరెక్టర్ సుధారాణి మాటలు నమ్మి సుమారు 600 మంది సుమారు రూ.150 కోట్లు కట్టామని వాపోయారు. తాము ఎన్నిసార్లు అడిగిన నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుండటంతో అనుమానం వచ్చిన బాధితులు ఎండీని నిలదీశామన్నారు. దీంతో ఎండీ భాస్కర్ చెక్కులు ఇచ్చారని తెలిపారు. కానీ అవి కూడా బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. వెంచర్ కార్యాలయం సైబరాబాద్ పరిధిలో ఉందని తెలిపారన్నారు.. అక్కడికి వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు. ఆర్జే వెంచర్స్ ఆస్తులు అమ్మి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఆర్జే వెంచర్స్ 600 మందికి మోసం చేసిందని వాపోయారు. లక్షల్లో మోసపోయామని వెంటనే తమ డబ్బును ఆర్జే వెంచర్స్ ద్వారా ఇప్పించాలని బాధితులు వేడుకుంటున్నారు. అప్పులు చేసి ఆర్జే వెంచర్స్ పై డబ్బులు కట్టామని, వెంటనే అధికారులు స్పందించాలని కోరారు. ఆర్జే వెంచర్స్ యాజమాన్యం పారిపోకుండా వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Thummala Nageswara Rao: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగానే కొనసాగుతుంది..

Show comments