NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు సచివాలయంలో వరద నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను మరింత ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో నేడు వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని లలిత కళాతోరణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (IIHT) ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సచివాలయంలో రాష్ట్రంలో వర్షాల ప్రభావం, వరద నష్టంపై అధికారులతో సమావేశం చేయనున్నారు.

Read also: Lord Shiva Stotram: ఈ స్తోత్రాలు వింటే దరిద్రాలు పోయి సకల సంతోషాలు మీ సొంతమవుతాయి

రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల ఏర్పడ్డ నష్టాలపై చేపట్టాల్సిన పునరావాస కార్యక్రమాలు అందించాల్సిన సహాయం పునర్నిర్మాణ కార్యక్రమాలపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. భారీ వర్షాలు వరదల వల్ల సంభవించిన నష్టాలపై సోమవారం మధ్యాహ్నం లోపు కలెక్టర్స్ కు నివేదిక ఇవ్వాలని సీఎస్ కోరింది. ఇప్పటికే 25 జిల్లాలకు మూడు కోట్ల చొప్పున నిధులు విడుదల చేశారు. ఇక రాష్ట్రంలో 29 జిల్లాలను వరద జిల్లాలుగా ప్రభుత్వం ప్రకటించనుంది. సాయంత్రం 4 గంటలకు ఫ్యూచర్​ సిటీపై సమీక్షా సమావేశం.. ఇక రాత్రి 8 గంటలకు 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ & సభ్యులకు మర్యాద పూర్వకంగా సచివాలయంలో విందులో పాల్గొననున్నారు.
Lord Shiva Parayanam: సోమవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి..

Show comments