CM Revanth Reddy: నేడు చార్మినార్ కు సీఎం రేవంత్ రెడ్డి.. భారీ బందోబస్తు..
- నేడు ఉదయం 10.30కి చార్మినార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి..
- రాజీవ్‌గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవంలో పాల్గొననున్న రేవంత్..
- పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: చారిత్రక చార్మినార్ వద్ద ఇవాళ రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇవాళ ఉదయం 10.30కి చార్మినార్‌కు సీఎం రేవంత్ చేరుకుంటారు. ఈ కార్యక్రమానికి రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర స్మారక కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. చార్మినార్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను టీపీసీసీ అధ్యక్షుడు బి.మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించనున్నారు. ఈ ఏడాది సద్భావన అవార్డును మాజీ మంత్రి డాక్టర్ గీతారెడ్డికి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ సద్భావన యాత్రలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపదాస్ మున్షీ, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, డి.శ్రీధర్ బాబు, డి.సీతక్క, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌బహదూర్ వెంకటరామిరెడ్డి పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు వేడుకలకు హాజరు కానున్నారు. చార్మినార్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి రానున్న సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తుకున పోలీసులు చేరుకున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని సూచించారు. వేరే మార్గాల ద్వారా వాహనదారులు వెళ్ళాలని తెలిపారు. చార్మినార్ వద్ద షాపుల బంద్ చేశారు.
Miyapur: మియాపూర్ లో సంచరించింది చిరుత కాదు.. అటవీ శాఖ ఏమన్నారంటే..
Also Read
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
తాజావార్తలు
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!