NTV Telugu Site icon

CM Revanth Reddy: జమిలి ఎన్నికల అంశంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: జమిలి ఎన్నికల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. జమిలి ఎన్నికల ముసుగులో అధికారం కాపాడుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలని బీజేపీ చూస్తుందని మండిపడ్డారు. రాజ్యాంగ మార్పులు.. సవరణలు విషయంలో బీజేపీ అవలంబిస్తున్న తీరు చూస్తున్నామన్నారు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ స్పిరిట్ ను దెబ్బతీయాలని బీజేపీ చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని సీఎం అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సీపీఎం జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. సీతారాం ఏచూరి పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.

అనంతరం సీఎం మాట్లాడుతూ.. పేదల పక్షాన తమ సహచర మిత్రపక్షమైన కాంగ్రెస్ తను ఏచూరి విబేధించారు.. నేను పీసీసీ అధ్యక్షుడ్ని అయ్యాక రెండు సార్లు కలిశానని తెలిపారు. సీతారాం ఏచూరితో మాట్లాడితే జైపాల్ రెడ్డితో మాట్లాడినట్టు ఉండేదన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడే వారు చాలా అరుదని తెలిపారు. నేను ఈ దేశానికి అంకితం అని చాలా మంది ఉపన్యాసాల్లో చెబుతుంటారు కానీ ఆచరణలో కాదన్నారు. జమిలి ఎన్నికల ముసుగులో దేశాన్ని కబళించాలి అనుకున్నప్పుడు.. సీతారాం ఏచూరి లేకపోవడం తీరని లోటన్నారు. ఏచూరి చూపిన మార్గంలో జమిలి ఎన్నికలను అడ్డుకుంటాం.. పోరాడుతాం.. అన్నారు. రాహుల్ గాంధీకి ఏచూరికి చాలా సన్నిహితంగా ఉంటారన్నారు. UPA-1,2 ఏర్పాటులో అనేక చట్టాలు తెచ్చినప్పుడు పేదలకు అనుకూలమైన నిర్ణయల్లో ఏచూరి పాత్ర గుర్తు చేసుకోవాలన్నారు. రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి రవణీత్ సింగ్ బిట్టు మాట్లాడిన మాటలపై మోడీ ఖండించలేదన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతపై అసభ్య భాష మాట్లాడిన మంత్రిపై చర్యలు తీసుకోకపోవడం ఫాసిస్ట్ విధానాలకు నిదర్శనం అని తెలిపారు.
Nagarkurnool: దవాఖానలో గుంపులుగా వీధి కుక్కలు.. భయాందోళన లో పేషెంట్లు