NTV Telugu Site icon

CM Revanth Reddy: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. జైశంకర్ తో భేటీ అయ్యే అవకాశం..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నాడు రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ఈ రోజు (మార్చ్ 13) ఉదయం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో రేవంత్ సమావేశం కానున్నారు. అయితే, విదేశీ పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి.. బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారని సమాచారం. కాగా, వీరి ఇరువురి సమావేశంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక, సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆకస్మిక పర్యటన వెనుక గల కారణం ఏమిటంటే.. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంపై చర్చించేందుకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో సీఎం భేటీ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Read Also: HMDA : హెచ్ఎండీఏ పరిధిని విస్తరించిన ప్రభుత్వం.. ఆ గ్రామాలన్నీ విలీనం

కాగా, ఈ కేసులో పలువురు కీలక నిందితులు విదేశాల్లో తలదాచుకుంటుండగా.. వారిని ఎలాగైనా ఇండియాకి రప్పించి, శిక్ష పడేట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఆయా దేశాల విదేశాంగ శాఖలతో మాట్లాడి నిందితులను ఇక్కడికి రప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి జైశంకర్ కు విజ్ఞప్తి చేయనున్నారని టాక్.