CM Revanth Reddy: ఉదయం గాంధీభవన్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నుంచి సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ వరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ అంతా బిజీబిజీగా గడపనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. నేడు ఉదయం 8:30 గంటలకు గాంధీ భవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేస్తారు. 9.20 గంటలకి పరేడ్ గ్రౌండ్ చేరుకొని సైనికుల స్మారకానికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటకు చేరుకొని పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం కోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
Read also: Traffic Alert: అలర్ట్.. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు
స్వాతంత్య్ర వేడుక సంబురాల్లో పాల్గొని.. అనంతరం పలువురికి సేవా, పురస్కార పథకాలు అందజేస్తారు. గోల్కొండ కోట జెండా వందనం కార్యక్రమం అనంతరం.. ఉదయం 11.45 గంటలకు బేగం పేట విమానాశ్రయం నుండి భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు బయలుదేరుతారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి మధ్యాహ్నం 12:50 గంటలకు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాకు చేరుకుంటారు. పుసుగూడెం వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పైలాన్ ఆవిష్కరణ,అనంతరం పంప్ హౌజ్-2ను స్విచ్ ఆన్ చేసి..అక్కడే మీడియాతో మాట్లాడతారు. అనంతరం సాయంత్రం 4.45 గంటలకు ఖమ్మం జిల్లా వైరా చేసుకొని…మూడో విడత 2లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీ ప్రారంభించి అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Independence Day: 78వ స్వాతంత్య్ర దినోత్సవం.. ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని