Khairatabad Ganesh: ప్రముఖ ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం వినాయక చవితికి ఒకరోజు ముందు ప్రారంభమైంది. 70 ఏళ్ల నుంచి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈసారి 70 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ఇంత పెద్ద గణపతిని చూసేందుకు భక్తులు వస్తుండటంతో నిర్వాహకులు ఒకరోజు ముందుగానే దర్శనానికి అనుమతి ఇచ్చారు. ఈ మేరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ సభ్యులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈసారి ఏడు ముఖాల శక్తి మహాగణపతిగా గణనాథుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకోవడానికి ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా ఖైరతాబాద్‌లోని వినాయక దర్శనానికి వెళ్లనున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సీఎం తో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ లు దర్శించుకోనున్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Read also: Khammam: నేటి నుంచి ఖమ్మంలో రూ.10వేల సాయం.. మూడు రోజుల్లో ప్రక్రియ ముగించనున్న సర్కార్..
మరోవైపు, 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఖైరతాబాద్ వైపు వచ్చే వాహనాలను ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఇతర మార్గాల్లో మళ్లించారు. బందోబస్తు కోసం మూడు షిప్టుల్లో 500 మంది పోలీసులు పనిచేస్తారని ట్రాఫిక్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడం, వారాంతం కావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తొలిరోజు రాష్ట్ర సీఎంతో పాటు గవర్నర్ కూడా పూజలకు వస్తున్నందున 24 గంటల పాటు 3 షిప్టుల్లో పోలీసులు విధులు నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. భారీ గణపతి వద్ద బందోబస్తుకు ముగ్గురు డీఎస్పీలు, 13 మంది ఇన్ స్పెక్టర్లు, 33 మంది ఎస్ ఐలు, 22 ప్లటూన్ల సిబ్బంది ఉంటారని తెలిపారు.
Indian Army: ఉగ్రవాదుల నుంచి గ్రామాలను రక్షించేందుకు జమ్మూ కాశ్మీర్‌లోని ప్రజలకు భారత సైన్యం శిక్షణ..!