NTV Telugu Site icon

Telangana Assembly 2024: కేసీఆర్‌ రికార్డ్ బ్రేక్‌ చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి..

Cm Revanth Reddy

Cm Revanth Reddy

Telangana Assembly 2024: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ 6వ రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. నిన్న ఉదయం సమావేశాలు ప్రారంభం కాగా.. అసెంబ్లీలో పద్దులపై చర్చ కొనసాగింది. ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని రద్దు చేసి అబడ్జెట్ పై చర్చించారు. 19 శాఖల పద్దుల పై చర్చ కొనసాగింది. కాగా.. సాయంత్రం 4.40 నుండి 5. 50 వరకు టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్‌ అనంతరం అసెంబ్లీ మళ్లీ మొదలైంది. అయితే నిన్న సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ మంగళవారం ఉదయం 3:15 వరకు కొనసాగడంతో రికార్డ్ క్రియేట్‌ అయ్యింది. నిన్న శాసనసభ సుమారు 17 గంటలకు పైగా సాగింది. దీంతో కేసీఆర్‌ రికార్డును తెలంగాణ సీఎం రేవంత్‌ బ్రేక్‌ చేశారు.

Read also: Telangana Assembly 2024: నేడు అసెంబ్లీలో 9 శాఖల పద్దులపై చర్చ..

అయితే అప్పట్లో అధికారంలో వున్న బీఆర్‌ఎస్‌ సర్కార్‌ గతంలో అర్థరాత్రి వరకు సభ కొనసాగింది. దాంతో అప్పట్లో అది రికార్డ్‌ బ్రేక్‌ సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ రికార్డును రేవంత్‌ సర్కార్‌ బ్రేక్‌ చేసింది. సోమవారం ఉదయం ప్రారంభమైన సభ సాయంత్రం టీ బ్రేక్‌ తరువాత మంగళవారం తెల్లవారు జామున 3.15 వరకు కొనసాగించారు. దీంతో కేసీఆర్‌ సర్కార్‌ రికార్డ్‌ ను సీఎం రేవంత్‌ సర్కార్‌ బ్రేక్‌ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోనే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. నేడు ఆరో రోజు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం కానుంది. ఈరోజు కూడా శాసనసభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది. స్కిల్ యూనివర్సిటీ బిల్లు నేడు సభ ముందుకు రానుంది. ఈ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టనున్నారు.
Manchu Vishnu-Meena: మంచు విష్ణు కీలక నిర్ణయం.. ప్రశంసించిన మీనా!

Show comments