NTV Telugu Site icon

KBR Park: కేబీఆర్‌ చుట్టూ ట్రాఫిక్‌ సమస్యకు చెక్‌.. త్వరలో అండర్‌పాస్‌లు, ప్లైఓవర్ల నిర్మాణం..

Kbp Park

Kbp Park

KBR Park: హైదరాబాద్ మహా నగరానికి దూరంగా కొండల మధ్య ఉన్న కేబీఆర్ పార్క్ ఇప్పుడు నగరానికి నడిబొడ్డుగా మారింది. నగరంలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లాలంటే ఈ పార్కు నుంచే వెళ్లాలి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలను కలిపే ముఖ్యమైన రహదారులు కేబీఆర్ పార్క్ నుంచి ఉన్నాయి. అంతే కాకుండా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, కృష్ణానగర్ తదితర కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ప్రాంతాలు వ్యాపార, వాణిజ్య పరంగా ఎంతో అభివృద్ధి చెందాయి. ఐటీ, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులంతా ఈ ప్రాంతంలోనే ఉంటారు. పలు ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న కేబీఆర్ పార్కు చుట్టుపక్కల రోడ్లన్నీ ఎప్పుడు రద్దీగా ఉంటాయి. జంక్షన్ల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరుతున్నాయి.

Read also: Mahalskshmi Stotram: ఈ స్తోత్రాలు వింటే అనారోగ్య సమస్యలు తొలగి సత్సంతానం కలుగుతుంది..

ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్న జంక్షన్లలో ట్రాఫిక్ సమస్యలకు త్వరలో చెక్ పెట్టనుంది. ఈ జంక్షన్లను సిగ్నల్ ఫ్రీగా మార్చేందుకు యూ-టర్న్‌లకు బదులు అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్‌లను నిర్మించి సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పార్కు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు ఇకపై యూ-టర్న్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేని విధంగా కేబీఆర్ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించనుంది. ఈ మేరకు పార్కు చుట్టూ ఉన్న ఆరు జంక్షన్లను రూ.826 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సీఎం నిధులు మంజూరు చేశారు. పరిపాలన అనుమతులు ఇచ్చారు. హెచ్‌సీటీ ప్రాజెక్టులో భాగంగా ఆరు జంక్షన్‌లను అభివృద్ధి చేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి డిజైన్లు కూడా సిద్ధం చేశారు. జంక్షన్ల అభివృద్ధి పనులు త్వరలో చేపట్టనున్నారు. 2 దశల్లో ఆరు జంక్షన్లను చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

KBR ఎంట్రన్స్ ముగ్ధా జంక్షన్

* జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుండి క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్ వరకు 2 లేన్ అండర్‌పాస్

* పంజాగుట్ట వైపు నుండి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మూడు లేన్ ఫ్లైఓవర్

* KBR ప్రవేశ జంక్షన్ నుండి పంజాగుట్ట వైపు మూడు లేన్ల అండర్ పాస్
Balakrishna : మోక్షజ్ఞ సినిమా పై క్రేజీ కామెంట్స్ చేసిన బాలయ్య

Show comments