Balakrishna : బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మోక్షజ్ఞ ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు.. నందమూరి నట వంశం నుంచి తెలుగు తెరకు పరిచయం కాబోతున్న మరో వారసుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. ఇప్పటికే డ్యాన్స్, యాక్టింగ్‌లో శిక్షణ పొంది సినీ రంగ ప్రవేశానికి రెడీ అయిపోయాడు. త్వరలో తన మొదటి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మెప్పించిన ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడిగా పనిచేస్తున్నారు. సుధాకర్ చెరుకూరితో పాటు నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దసరాకి ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రాన్ని దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని విజువల్‌గా గ్రాండ్‌గా, సింబాలిక్‌గా తెరకెక్కించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు కూడా ప్రాధాన్యత ఇచ్చిన సంగతి తెలిసిందే.
Read Also:Mahalskshmi Stotram: ఈ స్తోత్రాలు వింటే అనారోగ్య సమస్యలు తొలగి సత్సంతానం కలుగుతుంది..
అందుకే సినిమా బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించాలనే ఆలోచనలో నిర్మాత ఉన్నాడట. దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఎంతో నమ్మకంతో తన వారసుడిని పరిచయం చేసే బాధ్యతను తనకు అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టేందుకు తాను నూటికి నూరు శాతం కృషి చేస్తానని ప్రశాంత్ వర్మ చెబుతున్నాడు. మోక్షజ్ఞ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ నటించలేదు. ఈ సినిమా ప్రారంభం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
Read Also:Tirupati Laddu Controversy: తిరుమల లడ్డూ వ్యవహారంపై సిట్ దర్యాప్తు వేగవంతం..
ఇది ఇలా ఉంటే.. ఐఫా అవార్డ్స్ కు హాజరు అయిన బాలయ్య బాబు, తన వారసుడు మోక్షజ్ఞ సినిమా పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ బాలయ్య ఏం మాట్లాడారు అంటే.. ‘ఐఫా సెలబ్రేషన్స్ లో పార్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అంటూ బాలయ్య చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా సదరు యాంకర్.. ‘మీ వారసుడు సినిమా ఎప్పుడు మొదలు కాబోతుంది ? అని ప్రశ్నించగా… మోక్షజ్ఞ మొదటి సినిమాని డిసెంబర్ లో లాంచ్ చేస్తున్నాం’ అని బాలయ్య కామెంట్స్ చేశారు.