NTV Telugu Site icon

CM Chandrababu: రేవంత్‌ రెడ్డిని అందుకే కలిసాను.. నా రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేదు..

Chandrababu Revanth Reddy

Chandrababu Revanth Reddy

CM Chandrababu: రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా చాలా అభివృద్ధి చేస్తున్నారని..అందుకే స్వయంగా వచ్చి కలిశానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అనేక సంక్షేభాలు ఎదురుకుంది తెలుగు దేశం పార్టీ అని తెలిపారు. నన్ను ఎందుకు జైలుకు పంపారో తెలియదన్నారు. కానీ తెలంగాణలో మీరు నాకోసం చేసిన నిరసనలు మర్చిపోలేనిదన్నారు. రాజకీయం అంటే సొంత వ్యాపారం చేసుకోవడం కాదని తెలిపారు. తెలుగు దేశం ముందు.. తెలుగు తరువాత చరిత్రకు చాలా తేడా ఉందన్నారు. హైదరాబాద్ లో హై టెక్ సిటి నీ ప్రారంభించిన అభివృద్ధి హైదరాబాద్ దేశంలో నెంబర్ వన్ అయ్యిందన్నారు. నాకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డు, ఎయిర్ పోర్ట్ దూర దృష్టి తో ప్రతిపాదన చేశానని తెలిపారు. వాటిని ప్రారంభించిన ఘనత తెలుగు దేశం పార్టీ దే అని హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ తరువాత వచ్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ టీడీపీ పేరు చెరిగిపోలేదన్నారు. మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గా చాలా అభివృద్ధి చేస్తున్నారని,
అందుకే స్వయంగా వచ్చి కలిశానని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు.

Read also: Mumbai Accident : ముంబైలో బీఎండబ్ల్యూ బీభత్సం.. బైక్ ను ఢీకొట్టడంతో మహిళ మృతి

రాష్ట్రాలు వేరైనా తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ములుగా కొనసాగుతామన్నారు. విడిపోయినా కూడా బయటి వారు వేస్తే ఒక్కటవుతామన్నారు. నాకు ఆంధ్ర తెలంగాణ అని కాకుండా తెలుగు ప్రజల కోసం పని చేస్తా అన్నారు. కొంత మంది గొడవలు పెట్టుకోవాలని అనుకుంటున్నారు.. కానీ గొడవలు పడితే నీళ్ళు రావు, ఇబ్బందులు ఎదురుకోవాలన్నారు. కలిసి చర్చించుకుంటే సమస్యలు తీరుతాయన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఏపీ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. కానీ సమస్య వేస్తే కలిసి సమన్వయం చేసుకుంటామన్నారు. కొంత మంది నేను అభివృద్ధి చేస్తే వక్రీకరించారన్నారు. హైదరాబాద్ మాత్రమే అభివృద్ధి చేసావ్ కాబట్టే రాష్ట్రం విడి పోయింది అన్నారు. కానీ మొదట రాజధాని అభివృద్ధి జరిగితేనే మారుమూల ప్రాంతాల కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. రాష్ట్రం విడి పోయాక ఏపీ లో నేను చేసిన అభివృద్ధి చేసే దిశగా పని చేస్తే.. నా తరువాత వచ్చిన ప్రభుత్వం దానిని నాశనం చేసిందన్నారు.

Read also: Viral Video: ఎంఎస్ ధోనీ కాళ్లు మొక్కిన సాక్షి.. వీడియో వైరల్!

తెలంగాణ మంచిగా అభివృద్ధి చెందింది.. మంచి పరిపాలన లేకపోతే రాష్ట్రం నష్టపోతుందన్నారు. ఇప్పుడు ఏపీ చాలా నష్టాల్లో ఉంది.. ఎంత కష్టపడైనా ఏపీ ను అభివృద్ధి చేస్తానని తెలిపారు. విజన్ 2020 అని నేను ఎప్పుడో చెప్పాను.. కానీ అప్పుడు అందరూ ఎగతాళి చేశారన్నారు. సెల్ ఫోన్ కడుపు నింపుతుండా అని మాట్లాడారు..ఇప్పుడు మళ్ళీ చెబుతున్న విజన్ 2047 అభివృద్ధి చెందిన భారత్ ఉంటుందన్నారు. అప్పటి వరకు దేశంలో ఏపీ అభివృద్ధి చెందిన నంబర్ వన్ రాష్ట్రంగా ఎదుగుతుడుందన్నారు. తెలుగు జాతి గ్లోబల్ నంబర్ వన్ గా ఉండాలన్నారు. మొన్నటి వరకు బ్రిటన్ ను పాలించింది కూడా మన భారతీయుడే అన్నారు. ప్రపంచంలో అందరికంటే ఆమోదమైన వ్యక్తులు భారతీయులన్నారు. అందులో ఎక్కువ శాతం మాన తెలుగు వారే అన్నారు. ప్రపంచానికి సేవ చేసే శక్తి మన భాతీయులకు ఉందన్నారు. మనకు యువ శక్తి ఎక్కువగా ఉందన్నారు. తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పని చేస్తానని తెలిపారు.

Read also: CM Chandrababu Naidu: ఆంధ్రపదేశ్, తెలంగాణ నాకు రెండు కళ్లు..

ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో నేను తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్య మంత్రి గా చేశానని గుర్తు చేసుకున్నారు. నా రికార్డు ఎవ్వరూ బ్రేక్ చేయలేదన్నారు. రాబోయే రోజుల్లో కమిటీలు వేసి నిర్ణయాలు తీసుకుందామని తెలిపారు. అదిలాబాద్ మొదలు శ్రీకాకుళం వరకు నేను తిరగని ప్రాంతం లేదన్నారు. మీరు నాకు అధికారాన్ని ఇచ్చారు.. దానికి సేవాభావంతో అభివృద్ధి చేశానన్నారు. నా చివరి బొట్టు వరకు ప్రజా సేవ చేస్తానని తెలిపారు. వచ్చే 30 ఏళ్లలో తెలుగు రాష్ట్రాలు ఎలా ఉంటాయో ఇప్పుడే ఒక విజన్ ఆలోచిస్తానని అన్నారు. ఈ సారి యువకులకు ఎక్కువగా అవకాశం ఇచ్చానని అన్నారు. తెలుగు దేశం చరిత్రలో ఇదే ఇంత పెద్ద విజయం అన్నారు. ఒక సునామీలా వచ్చిన ఈ విజయానికి చాలా మంది కొట్టుకు పోయారన్నారు. ప్రజా స్వామ్యంలో రాజులు లేరు.. నియంతలు లేరన్నారు.

Read also: Ration Cards: రాష్ట్ర ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్ ..రేషన్ కార్డులో సవరణలపై గ్రీన్ సిగ్నల్..

ఎవ్వరైనా విర్రవీగితే ప్రజలు ఎక్కడికి పంపలో పంపేస్తారన్నారు. అందుకే నా మంత్రులకు కూడా విర్రవీగకుండా పని చేయాలని చెప్పానని తెలిపారు. అప్పుడు జన్మభూమి, శ్రమదానం లాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టానని తెలిపారు. సైబరాబాద్ అని హైదరబాద్ కి నామకరణం చేశామన్నారు. తెలంగాణలో త్వరలోనే పార్టీ కి కొత్త స్ట్రాక్చర్ తీసుకొస్తా అన్నారు. యువకులకు అవకాశం ఇస్తాను.. తెలంగాణలో పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తానని తెలిపారు. మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకెవరు కూడా క్యాన్సర్ తో చనిపోవడ్డని ఎన్టీఆర్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించారని తెలిపారు. ఇప్పుడు బాలకృష్ణ ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నడుస్తుస్తుందన్నారు.
Ashada Masam 2024: ఆషాఢ మాసంలో ఈ పనులు చేస్తే అంతా సంతోషమే..!

Show comments