NTV Telugu Site icon

SPA Center: స్పా ముసుగులో వ్యభిచారం.. 7 మంది అరెస్ట్‌..

Spa Cener Chandanagaar

Spa Cener Chandanagaar

SPA Center: నగరంలోని చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొందరు వ్యక్తులు స్పా సెంటర్‌ ను నిర్వహిస్తున్నారు. స్పా ముసుగులో వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నారు. స్థానిక సమాచారంతో చందానగర్ లోని స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసుల దాడులు చేశారు. కొందరు నిర్వాహకులు స్పా ముసుగులో వ్యభిచారం జరుపుతున్నట్లు గుర్తించారు. స్పా సెంటర్ పై దాడి చేసి నలుగురు యువతులు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. పట్టుబడ్డ వారి నుండి నగదు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీసులకు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు కేసును అప్పగించారు.

Read also: Road Accident: ఖైరతాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ ను ఢీకొట్టిన కారు..

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న చందానగర్ పోలీసులు. ఈ స్పా సెంటర్‌ ను ఎప్పటి నుంచి కొనసాగిస్తున్నారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. కొంతమంది ఈజీ మనీ కోసం స్పా సెంటర్‌ను నడుపుతున్నారని పోలీసులు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. మహిళల అక్రమ రవాణాతో పాటు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్వాహకులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు. స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్పా సెంటర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో వుండటం పలు విమర్శలకు దారి తీస్తోంది.

Read also: Kurnool Onion Price: కర్నూలు ఉల్లికి భారీ డిమాండ్.. కారణం ఏంటంటే?

కెపిహెచ్ బి పరిధి రోడ్ నెంబర్ 4లో వున్న మరో స్పా పై హ్యూమన్ ట్రాఫిక్ పోలీసుల దాడులు నిర్వహించారు. సెలూన్, స్పా ముసుగులో కొందరు నిర్వాహకులు వ్యభిచారం నడుపుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సెలూన్, స్పా ముసుగులో వ్యభిచారం నడుపుతున్న ముగ్గురు యువతులను, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. కెపిహెచ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

Dengue Fever: డెంగ్యూ రాకూండా ఈ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..

Show comments