NTV Telugu Site icon

Home Ministry: ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్రం షాక్‌.. 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు..

Central Home Ministry

Central Home Ministry

Home Ministry: తెలంగాణలోని ముగ్గురు ఐపీఎస్ అధికారులకు షాక్ ఇచ్చింది కేంద్ర హోం శాఖ. ఐపీఎస్‌ అధికారులు అంజనీ కుమార్, అభిలాష్ బిస్తా, అభిషేక్ మహంతిలను రిలీవ్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించబడ్డ ముగ్గురు అధికారులు.. వెంటనే ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది కేంద్ర హోంశాఖ.. అంతేకాదు, 24 గంటల్లోగా ఆంధ్రాలో రిపోర్ట్ చేయాలని స్పష్టం చేసింది.. రాష్ట్ర విభజన సందర్భంగా ఈ అధికారులను ఏపీకి కేటాయించబడ్డారు.. అయితే, ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తెలంగాణలోనే కొనసాగుతున్నారు ఐపీఎస్ అధికారులు.. ప్రస్తుతం డీజీ ర్యాంకులో కొనసాగుతోన్న అంజనీకుమార్‌.. రోడ్ సేఫ్టీ డీజీగా ఉండగా.. డీజీ ర్యాంక్‌లో ఉన్న మరో ఐపీఎస్‌ అధికారి అభిలాష్ బిస్తా.. పోలీస్ ట్రైనింగ్ డీజీగా ఉన్నారు.. ఇక, ఎస్పీ ర్యాంకులో కొనసాగుతున్న అభిషేక్ మహంతి. ప్రస్తుతానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్నారు.. అయితే, అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతిలను వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశించి కేంద్ర హోంశాఖ.. వెంటనే ఏపీ క్యాడర్ లో రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది..

Read Also: Gang Rape : కామపిశాచులకు కేరాఫ్‌.. మతిస్థిమితం లేని మహిళను సైతం వదలని మృగాళ్లు